Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

vehicle insurance: Are you taking vehicle insurance? Keep these things in mind

 Vehicle insurance: వెహికిల్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి.

vehicle insurance: Are you taking vehicle insurance? Keep these things in mind

Vehicle insurance  మీరు మీ వాహనానికి ఇన్స్యూరెన్స్ తీసుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మర్చిపోవద్దు.

మనిషికైనా, వస్తువుకైనా బీమా ఉంటే ధీమా ఉంటుంది. అనుకోని సంఘటన జరిగితే మనకు లేదా మన కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వడమే బీమా ముఖ్య ఉద్దేశ్యం. అందువల్ల, ప్రతి ఒక్క వాహనదారుడు తప్పకుండా బీమా కలిగి ఉండాలని మోటార్ వెహికల్ చట్టం చెబుతోంది. ఇటీవల, మోటార్ వెహికల్ చట్టం నిబంధనలు మరింత కట్టుదిట్టం చేయడంతో తమ వాహనానికి ఇన్సూరెన్స్ తీసుకోవడానికి చాలా మంది ముందుకొస్తున్నారు. కొన్ని ప్రైవేట్ సంస్థలు ఇన్సూరెన్స్ రంగంలోకి ప్రవేశించడంతో వాహనదారులు తమ అవసరాలకు తగిన విధంగా ఉత్తమ బీమాను ఎంచుకునే స్వేచ్ఛ లభించింది. అయితే, మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ ఇన్సూరెన్స్ పాలసీల్లో దేన్ని ఎంచుకోవాలనే సందేహం చాలా మందికి ఉంటుంది. అందువల్ల, సరైన ఇన్సూరెన్స్ను ఎంచుకునే ముందు ఏ పాలసీని ఎంచుకోవాలి? ఎంత మొత్తంలో ఇన్సూరెన్స్ చేయించాలి? ఏ బీమా సంస్థను ఎంచుకోవాలి? అనే మూడు ప్రధాన అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టండి. భారతదేశంలో మొత్తం 25 మోటార్ ఇన్సూరెన్స్ కంపెనీ విభిన్న కవరేజ్ భీమా ప్లాన్లను అందిస్తున్నాయి. వాటిలో నుంచి సరైన ప్లాన్ను ఎంచుకనే ముందు ఈ క్రింది అంశాలను పరిగణలోకి తీసుకోండి.

ఏ పాలసీ కవర్ ఎంచుకోవాలి?

భారత ప్రభుత్వం తన మోటారు వాహనాల చట్టం, 1988లో పేర్కొన్న దాని ప్రకారం, ప్రతి వాహన యజమాని తమ వాహనానికి చెల్లుబాటు అయ్యే థర్డ్ పార్టీ (టిపి) భీమా కవరేజీని కలిగి ఉండటం తప్పనిసరి.

థర్డ్ పార్టీ ఎవరు?

భీమా చేసిన వ్యక్తి , భీమా సంస్థలు వరుసగా ఫస్ట్, సెకండ్ పార్టీ అయితే, వాహనం కారణంగా ప్రమాదానికి గురైన మరొక వ్యక్తికి అందేజేసే కవరేజ్ను థర్డ్ పార్టీ కవరేజ్ అంటారు. థర్డ్ పార్టీ కవరేజీ క్రింద, ప్రమాదానికి గురైన వ్యక్తి అవసరమయ్యే వైద్య ఖర్చులు, వాహనాల మరమ్మతులు, చట్టపరమైన బాధ్యతలను భీమా సంస్థ చెల్లిస్తుంది.

వాహనానికి నష్టం జరిగితే?

ప్రమాదం కారణంగా మీ వాహనానికి నష్టం జరిగితే మీకు రెండు రకాల కవరేజ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.

కొలిజన్ కవరేజ్

ఎదురుగా వచ్చే వాహనం లేదా చెట్టు లేదా డివైడర్ వంటి వాటి ద్వారా మీ వాహనానికి డ్యామేజీ జరిగితే, దానికి అయ్యే ఖర్చులను కొలిజన్ కవరేజ్ భరిస్తుంది. ఇది దొంగతనం లేదా విధ్వంసాల వల్ల వాహనానికి జరిగే నష్టానికి బాధ్యత వహించదు.

కాంప్రహెన్షివ్ కవరేజ్

కాంప్రహెన్షివ్ కవరేజ్ కింద థర్డ్ పార్టీకి జరిగిన నష్టానికి కవరేజీ అందించడమే కాకుండా, మీ వాహనానికి జరిగే నష్టాన్ని కూడా కవర్ చేస్తుంది. విధ్వంసం, దొంగతనం, ప్రకృతి వైపరీత్యాలు వంటివి కూడా ఈ కవరేజ్ పరిధిలోకి వస్తాయి. వీటితో పాటు, మీరు వేర్వేరు ప్రొవైడర్లతో యాడ్-ఆన్ కవరేజ్‌లను కూడా కనుగొనవచ్చు. ఇంజిన్ రక్షణ, వైద్య ఖర్చులు, ఉపకరణాలు మొదలైన వాటిని కవర్ చేయడానికి యాడ్-ఆన్ పాలసీలు ఉపయోగపడతాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "vehicle insurance: Are you taking vehicle insurance? Keep these things in mind"

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0