Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jagananna Amma Odi

వీరికిక.. అమ్మ ఒడి రానట్టేనా ?

Jagananna Amma Odi

సున్నా హాజరు శాతమంటూ తిరస్కరణ

వందలాది మందికి మొండిచేయి

తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు

జిల్లావ్యాప్తంగా వందలాది మంది విద్యార్థులు అమ్మ ఒడికి నోచుకోలేదు. ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతాలను సమర్పించినా విద్యార్థుల హాజరు శాతం సున్నా ఉందంటూ సాంకేతిక కారణాలతో పథకానికి దూరం పెట్టారు. దీనిపై యాజమాన్యాలపై తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. వాస్తవానికి జనవరి వరకు పాఠశాలలు తెరచుకోలేదు. ఆన్‌లైన్‌ తరగతు లను మాత్రమే నిర్వహించారు. అమ్మ ఒడి అర్హతకు హాజరు శాతం నిబంఽధన పెట్టలేదు. రేషన్‌కార్డు, ఆధార్‌     కార్డులు, తల్లి బ్యాంకు ఖాతా వివరాలను సమర్పిస్తే సరిపోతుందని నిర్ణయించారు. ఆ మేరకే విద్యా ర్థుల వివరాలన్నీ నమోదయ్యాయి. తీరా హాజ రు శాతం లేదనడంతో విద్యార్థుల తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. జిల్లాలో 3.55 లక్షల మంది తల్లులు అమ్మఒడికి అర్హత సాధించినట్టు నిర్ధారించారు. వివిధ కారణాలతో దాదాపు ఐదు వేల మందికి అమ్మ ఒడి పడలేదు. బ్యాంకు ఖాతాల్లో తప్పులు, ఆధార్‌ వివరాలను సరిదిద్ది తల్లుల ఖాతాల్లో సొమ్ములు జమ చేశారు. హాజరు విషయంలో ఇప్పటికీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక లోపం కారణంగానే సున్నా హాజరు అంటూ ఈ పథకం నోచుకోలేదు. ఇలాంటి వారికి అమ్మ ఒడి వర్తింపచేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Jagananna Amma Odi "

  1. Now government is focusing more on online schemes, Make Nadakacheri cv income certificate online n karnataka.

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0