Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Post Office: Cash withdrawals at post offices, collection of charges on deposits .. Implemented from 1st April

 Post Office: పోస్టాఫీసుల్లో నగదు ఉపసంహరణలు, డిపాజిట్లలపై చార్జీల వసూలు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

Post Office: Cash withdrawals at post offices, collection of charges on deposits .. Implemented from 1st April


Post Office: మీకు పోస్టాఫీసులో ఖాతా ఉందా..?అయితే ఇది మీ కోసమే. పోస్టాఫీసుల్లో నగదు జమ చేయడం, లేదా నగదు ఉపసంహరించుకోవడంపై ఇప్పుడు ఛార్జీలు విధించనున్నారు. ఈ కొత్త చార్జీలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని పోస్టల్‌ శాఖ తెలిపింది. అయితే పోస్టాఫీసుల్లో ఖాతాను బట్టి ఈ చార్జీలను వసూలు చేయనున్నారు. నెలకు నాలుగు సార్లు నగదు ఉపసంహరణ చేసుకుంటే ఎటువంటి చార్జీలు వసూలు చేయరు. నాలుగు కంటే ఎక్కువ నగదు ఉపసంహరించుకుంటే ప్రతి లావాదేవీకి రూ.25 చొప్పున చార్జీలు విధించనున్నారు. అయితే ఈ విధానం బ్యాంకులకు ఉండేది. ఏటీఎంల నుంచి నాలుగు కంటే ఎక్కువ డబ్బులు డ్రా చేసినట్లయితే చార్జీలు విధించే వారు. ఇప్పుడు పోస్టల్‌ శాఖలో అమలు చేస్తున్నారు.

అలాగే పోస్టాఫీసుల్లో నగదు జమ చేయాల్సిన సమయంలో ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇక ప్రాథమిక పొదుపు ఖాతా కాకుండా కరెంటు ఖాతా ఉంటే ప్రతి నెలా రూ.25వేల చొప్పున ఉపసంహరించుకోవచ్చు.

అప్పటి వరకు ఎలాంటి చార్జీలు వసూలు చేయరు. అంతేకాకుండా మీరు నెలలో పది వేల చొప్పున నగదు డిపాజిట్‌ చేసినట్లయితే ఎటువంటి రుసుము ఉండదు. ఆ మొత్తానికంటే ఎక్కువగా డిపాజిట్‌ చేసినట్లయితే కనీసం రూ.25 వసూలు చేయనున్నారు. అంతే మీ మొత్తంలో 0.50 శాతం వరకు వసూలు చేస్తారు. అలాగే పోస్టు పేమెంట్‌ నెట్‌వర్క్‌లో అపరిమిత లావాదేవీలు పూర్తిగా ఉచితం. ఇక ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్‌పై కూడా ఛార్జీ చెల్లించాలి. ఐపీపీబీయేతర నెట్‌ వర్క్‌లలో నెలకు మూడు లావాదేవీలు ఉచితం. అలాగే ఇవే కాకుండా పోస్టాఫీసులలో మినీ స్టేట్‌ మెంట్‌ తీసుకోవడానికి ఐదు రూపాయలు వసూలు చేస్తారు.

అలాగే ప్రస్తుతం ఛార్జీలను అమలు చేస్తున్నా..పోస్టల్‌ శాఖ వినియోగదారులకు ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసువస్తోంది. వివిధ రకాల స్కీమ్‌లను ప్రవేశపెడుతోంది. ఒకప్పుడు లేటర్లకు మాత్రమే పరిమితం అయ్యే పోస్టల్‌ శాఖ.. అప్పుడు అన్ని రకాల సేవలను అందిస్తోంది. పోస్టల్‌ శాఖలో ఎన్నో రకాల స్కీమ్‌లను ప్రవేశపెడుతూ ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది పోస్టల్‌ శాఖ.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Post Office: Cash withdrawals at post offices, collection of charges on deposits .. Implemented from 1st April"

  1. పోస్ట్ ఆఫీస్ లకు వెళ్లి డబ్బులు వేసేవారు వెయ్యికి ఒక్కరు. పూర్తిగా వెళ్లడం మానేశారు.ఇప్పుడు ఛార్జిలు అంటే ఎవరు పోస్ట్ ఆఫీస్ ముఖం కూడా చూడరు... ముందు ముందు పోస్ట్ ఆఫీస్ లు వుండవన్న మాట

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0