Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Andhra pradesh: AP government key decision ... no longer corona treatment on buses

 Andhra pradesh : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ... ఇకపై బస్సుల్లో కరోనా చికిత్స

Andhra pradesh: AP government key decision ... no longer corona treatment on buses

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. గత రెండు రోజులుగా తగ్గిన కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. కఠినంగా కర్ఫ్యూ అమలు చేస్తున్నా.. చికిత్స సదుపాయాలు, ఆక్సిజన్ బెడ్ల సంఖ్య పెంచినా.. కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.. మరణాల సంఖ్య కూడా తగ్గడం లేదు.

ఆంధ్రప్రదేశ్‌లో నిత్యం వేల సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.

మృతుల సంఖ్య కూడా రోజూ 100కు అటూఇటూగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.

తొలి దశలో పట్టణాల్లో భారీగా కేసులు నమోదైతే.. సెకెండ్ వేవ్ లో పల్లెలపైనా కరోనా పంజా విసురుతోంది. పట్టణాల్లో ప్రస్తుతం 39 శాతం కేసులు ఉంటే.. పల్లెల్లో 61 శాతం కేసులు నమోదు అవ్వడం కలవర పెడుతోంది.

కొన్ని గ్రామాల్లో అయితే కరోనా భయంతో సరిహద్దుల్లో గేట్లు పెడుతున్నారు. బయట నుంచి ఎవరినీ తమ గ్రామంలోకి అనుమతించడం లేదు. దీంతో అంబులెన్స్ వెళ్లడం కూడా ఇబ్బందిగా మారింది. ఆ గ్రామం దాటి మరో గ్రామం వెళ్లాలి అనుకున్న వారు కూడా కష్టాలు పడుతున్నారు.

ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. అసలే సరైనా రవాణ సదుపాయాలు ఉండవు.. అత్యవసరం అనుకుంటే డోలీలో రోగులను తీసుకెళ్లాల్సి వస్తోంది. కరోనా సమయంలో గిరిజన ప్రజల పరిస్థితి మరీ దారుణంగా మారింది. కరోనా వచ్చిందని తెలిస్తే ఎవరూ సాయం పట్టేవారు లేక.. కొన్ని కిలోమీటర్లు అనారోగ్యంతో నడవాల్సి వస్తోంది.

ఈ నేపథ్యంలో కరోనాతో బాధపడేవారికి ప్రత్యేకంగా చికిత్స అందించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా వైద్య సదుపాయాలు తక్కువగా ఉండే ఏజెన్సీ ప్రాంతాల్లో ఆర్టీసీ స్లీపర్‌ బస్సుల్లో కొవిడ్‌ రోగులకు చికిత్స అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించారు.

ఏజెన్సీ ప్రాంతాలైన బుట్టాయిగూడెం, కె.ఆర్.పురం పీహెచ్‌సీలో ఆక్సిజన్ బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆస్పత్రులు అందుబాటులో లేని ప్రాంతాల్లో బస్సులను అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రస్తుతం 10 ఆర్టీసీ స్లీపర్ బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

భవిష్యత్తులో మరిన్ని ఆర్టీసీ స్లీపర్ బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రయోగాత్మకంగా వెన్నెల బస్సుల్ల్లో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ బెడ్లను మంత్రి ఈ సందర్భంగా పరిశీలించారు. బస్సుల్లో ఏర్పాట్లు సహా సదుపాయాలను ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ మంత్రి నానికి వివరించారు.

ఏపీ వ్యాప్తంగా కఠిన కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు అత్యావసరాలకు అనుమతి ఇస్తూ.. మధ్యాహ్నం 12 నుంచి ఉదయం 6 గంటల వరకు అన్నీ బంద్ చేస్తున్నారు. అయినా ఆశించిన స్థాయిలో కరోనా కేసులు కంట్రోల్ కావడం లేదు. ముఖ్యంగా గ్రామాలు ఏజెన్సీ ప్రాంతాల్లో కేసుల భారీగా పెరుగుతుండడంతో తాజాగా ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Andhra pradesh: AP government key decision ... no longer corona treatment on buses"

  1. All online services provided by Tamilnadu states is available on this portal Tnega TNesevai TNeGA - CSC Management for eDistrict Tamilnadu. மின் ஆளுமை ஆணையரகம் . தமிழ்நாடு மின்-ஆளுமை முகமை

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0