Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Director of Observation-Education on School Resumption

పాఠశాలల పునఃప్రారంభంపై పరిశీలన-విద్యాశాఖ డైరెక్టర్

Director of Observation-Education on School Resumption

అనుకూల వాతావరణం వస్తే 10వ తరగతి పరీక్షలు

స్కూల్ కాంప్లెక్స్లుకు జగనన్న విద్యా కానుక కిట్లు

పాఠశాలల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు

 కరోనా సెకండ్ వేవ్ తగ్గు ముఖం పట్టిన తరువాత జూలై 1 నుంచి పాఠశాలల పునఃప్రారం బానికి యోచిస్తున్నామని పాఠశా లల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు అన్నారు. మంగళ వారం ఆర్జేడీ నరసింహారావుతో కలసి మచిలీపట్నం పాతరామన్నపేట మునిసిపల్ స్కూల్, రాంజీ ప్రభుత్వం హైస్కూల్ను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలల్లో నాడు- నేడు కింద జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యేనాటికి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు పుస్తకాలు, బూట్లు, టైలు, యూనిఫాం ఇచ్చే కార్యక్రమం ముమ్మరంగా కొన సాగుతోందన్నారు. స్కూల్ కాంప్లెక్స్లకు జగనన్న విద్యాకానుక కిట్లు ఇప్పటికే చేరాయన్నారు. విద్యాసంవత్సరంలో విద్యా కార్యక్రమాలు సంతృప్తికరంగా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. నాడు నేడు కార్యక్ర మాల అమలువల్ల పాఠశాలలకు భౌతిక వనరులు ఏర్పడ్డాయన్నారు. 10వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. అయితే కొవిడ్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పరీక్షలు జరుపుతామన్నారు. ఇప్పటికే పశ్చిమగోదావరి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో* *పర్యటించామన్నారు. కృష్ణాజిల్లాలో నిర్వహిస్తున్న నాడు- నేడు కార్య క్రమాల అమలును జిల్లా విద్యాశాఖాధికారి తహెరా సుల్తానా, ఇతర అధికా రులతో చర్చించామన్నారు. కొవిడ్ వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ విద్యాశాఖాధికారులు పరిపాలనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. అనంతరం డీఈవో కార్యాలయంలో చినవీరభద్రుడుకు డీఈవో తాహెరా సుల్తానా, సూపరింటెండెంట్లు పూలదండలతో స్వాగతం పలికారు. డీఈవో కార్యాలయంలో ఫైళ్ల పెండింగ్పై అధికారులు, సూపరింటెండెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.*


            

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Director of Observation-Education on School Resumption"

  1. Sir i request you to please release PET results

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0