Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Covid: Strong signals start for the third wave ..!

Covid : థర్డ్ వేవ్ కు బలమైన సంకేతాలు మొదలు .. !

Covid: Strong signals start for the third wave ..!

  •  క్రమంగా పెరుగుతున్న ఆర్‌నాట్‌ విలువ
  • ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

మళ్లీ అదే తప్పు చేస్తున్నాం.. గతంలో కొవిడ్‌ తొలి దశ మందగించాక.. అన్ని ఆర్థిక కార్యకలాపాలు మొదలు పెట్టాం. అదే సమయంలో ప్రజలు కొవిడ్‌ ప్రొటోకాల్‌ను గాలికొదిలేశారు. ఫలితంగా ఉప్పెనలా సెకండ్‌ వేవ్‌ విరుచుకుపడి లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. అంత భయంకరమైన పరిస్థితులు చూసినా జనాల్లో మార్పు రాలేదు. ఒక్కసారి కేసులు తగ్గగానే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. దేశంలో 60 శాతం జనాభాకు టీకాలు అందకముందే.. మార్కెట్ల వంటి చోట్ల నిబంధనలు ఎవరూ పాటించడంలేదు. ఫలితంగా కేసులు మెల్లగా పెరగటం మొదలైంది.

ఆర్‌నాట్‌ విలువను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది.

స్థిరంగా యాక్టివ్‌ కేసులు..

మే 15వ తేదీ నుంచి జూన్‌ 26వ తేదీ మధ్య ఆర్‌నాట్‌ విలువ 0.78 నుంచి 0.88కు పెరిగింది. ఫలితంగా యాక్టివ్‌ కేసుల సంఖ్యలో తగ్గుదల నిలిచిపోయింది. ఈ విషయాన్ని చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేథమేటికల్‌ సైన్సెస్‌ పేర్కొంది. ఒక్క సారి సెకండ్‌వేవ్‌ ముందు పరిస్థితులను గమనిస్తే.. ఫిబ్రవరి 15వ తేదీన దాదాపు 9వేలకు కేసులు తగ్గాయి. గతేడాది జూన్‌లో ఈ స్థాయిలో కేసులు వచ్చాయి. కానీ, ఆ తర్వాత నుంచి స్వల్పంగా పెరగటం మొదలై మే మొదటి వారం చివర్లో రోజుకు 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా జులై 5వ తేదీన 34వేలకు కేసుల సంఖ్య తగ్గింది. కానీ, ఆ తర్వాతి రోజు నుంచి మెల్లగా పెరగటం మొదలై ఇప్పుడు మళ్లీ నిత్యం 40 వేల పైచిలుకు కేసులు వస్తున్నాయి.

ఆర్‌నాట్‌ ఏం చెబుతోంది..?

వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని ఆర్‌నాట్‌గా పేర్కొంటారు. తాజాగా ఆర్‌నాట్‌ విలువలు 0.78 నుంచి 0.88కు పెరగటాన్ని విశ్లేషిస్తే.. 100 మంది కొవిడ్‌ పాజిటివ్‌ బాధితుల నుంచి వ్యాధి మే 15 నాటి విలువ ప్రకారం 78 మందికి సోకింది. కానీ, జూన్‌ 26కు వచ్చేసరికి వ్యాధి 88 మందికి సోకుతున్నట్లు గుర్తించారు. ఆర్‌నాట్‌ విలువ 1 దాటిందంటే.. వ్యాధి వ్యాప్తిరేటు శరవేగంగా పుంజుకుంటుంది.

సాధారణ ఫ్లూ సోకిన ఐదు రోజుల్లోపే లక్షణాలు బయటపడిపోతాయి. ఈ క్రమంలో ఆ వ్యక్తి అప్రమత్తమై చికిత్స తీసుకొంటాడు. దీనికి తోడు వ్యాక్సిన్‌ తీసుకొన్నవారిని, వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉన్న వారిని ఇది ఏమీ చేయలేదు. ఈ రెండు లేనివారిని మాత్రమే ఇబ్బంది పెడుతుంది. అందుకే దీని వ్యాప్తిరేటు(ఆర్‌నాట్‌) 1.3గా ఉంది. కానీ, కొవిడ్‌లో వైరస్‌ వేరియంట్‌ను బట్టి 3 నుంచి 14 రోజుల పాటు లక్షణాలు బయటపడకుండా ఉండేందుకు అవకాశం ఉంది. ఆ రెండు వారాలపాటు లక్షణాలు కనిపించని వ్యాధిగ్రస్తుడు పలువురికి వైరస్‌ను అంటిస్తాడు. సాధారణ ఫ్లూ వ్యాప్తిరేటు 1.3 అనుకుంటే.. పది దశలు దాటాక అది 56 మందికి సోకే అవకాశం ఉంది. అదే కొవిడ్‌-19 వ్యాప్తిరేటు కనిష్ఠంగా 2 అనుకుంటే పది దశలు దాటాకా 2047 మంది ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంది.

తగ్గుదలలో బేస్‌లైన్‌ చేరలేదు..

ఫస్ట్‌వేవ్‌ నెమ్మదించాక నమోదైన రోజుకు 9వేల కేసుల స్థాయికి చేరడానికి మనం ఇంకా చాలా దూరంలో ఉన్నాం. ప్రస్తుతం కొన్నాళ్ల నుంచి రోజుకు సగటున 40వేలు కేసులు వస్తున్నాయి. ఇదేం చిన్న సంఖ్య కాదు. మనం మే చివరి వారంలో వచ్చిన 4 లక్షల కేసులతో పోల్చి చిన్నదిగా భావిస్తూ ఊరట చెందుతున్నామంతే. దేశంలో వ్యాధి పరిస్థితిపై కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధిపతి వి.కె.పాల్‌ స్పందిస్తూ..''ఈ వేవ్‌లో కేసుల సంఖ్యను వీలైనంత తగ్గించాలి. మనం 10వేల దిగువకు చేరడానికి మరో మూడువారాల వరకూ పట్టొచ్చు. రోజుకు 35వేలకుపైగా కేసులు రావడం ఏమాత్రం చిన్నవిషయం కాదు. మనం ఇప్పుడే వైరస్‌ను అదుపు చేయకపోతే అది మళ్లీ పుంజుకొంటుంది'' అని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేరళ, మహారాష్ట్రల్లో ఆర్‌నాట్‌ విలువ 1పైనే ఉంది.

వ్యాధి అంతం ఇలా..

అంటు వ్యాధులను కనుమరుగు చేయడానికి కొంతకాలం పాటు ఆర్‌నాట్‌ విలువను 1కంటే తక్కువగా ఉంచడం చాలా అవసరం. భారత్‌ వంటి జనాభా ఎక్కువ ఉన్న దేశాల్లో ఇది చాలా కష్టం. కానీ, ప్రస్తుతం భారత్‌లో రికవరీలు వేగంగా పెరగడం.. ఆర్‌ విలువ తగ్గడంతో వ్యాధిపై మెల్లగా పట్టు సాధిస్తున్నాం. కొంత కాలం పాటు ఆర్‌ విలువను 1కంటే తక్కువగా ఉంచగలిగితే ఈ వ్యాధి అదృశ్యమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Covid: Strong signals start for the third wave ..!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0