Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Bottled Water: The destruction of bottled packaged water .. Sensational facts in a new study.

 Bottled Water : బాటిళ్లలో వచ్చే ప్యాకేజ్డ్ వాటర్ సర్వనాశనం..కొత్త అధ్యయనంలో సంచలన నిజాలు.

ట్యాప్ వాటర్ లేదా పంపు నీరు తాగితే రోగాలు వస్తాయని చాలామంది భావిస్తుంటారు. అందుకే బ్రాండెడ్ బాటిల్ వాటర్‌కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రజల్లో ఉన్న ఈ అభిప్రాయం వల్ల ఇటీవల కాలంలో వాటర్ బాటిళ్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. అయితే వాటర్ బాటిల్స్ కారణంగా పర్యావరణంపై 3,500 రెట్లు ఎక్కువగా ప్రభావం పడుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనం బార్సిలోనా ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ నేతృత్వంలో జరిగింది. బాటిల్ వాటర్, ట్యాప్ వాటర్, ఫిల్టర్ చేసిన ట్యాప్ వాటర్ వినియోగాలపై ఆబ్జెక్టివ్ డేటాను అందించడమే లక్ష్యంగా ఈ అధ్యయనం కొనసాగింది. దీని ఫలితాలు సైన్స్ ఆఫ్ ది టోటల్ ఎన్విరాన్మెంట్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

సాధారణంగా పంపు నీటిలో క్రిమిసంహారక మందులు వాడతారు. దీని వల్ల నీటిలో ట్రై హలో మీథేన్ (THM) ఉత్పన్నమవుతుంది. ఈ రసాయన సమ్మేళనం వల్ల మూత్రాశయ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది. అయితే బార్సిలోనాలోని పంపు నీటిలో తక్కువగా రసాయన సమ్మేళనాలు ఉండటం వల్ల ముప్పు తక్కువగా ఉంటుందని అధ్యయనం వెల్లడించింది. బాటిల్ వాటర్ తో పోలిస్తే పంపు నీరే శ్రేయస్కరమని అధ్యయన పరిశోధకుడు క్రిస్టినా విల్లానుయేవా చెప్పారు.
బార్సిలోనాలోని మొత్తం జనాభా బాటిల్ వాటర్‌ తాగాలని నిర్ణయించుకుంటే.. ఏడాదికి సగటున 1.43 జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉందని అధ్యయనం సూచించింది. ఇక ఈ బాటిల్స్ వెలికి తీయాలంటే $ 83.9 మిలియన్లు ఖర్చవుతుందని అధ్యయనం పేర్కొంది. ట్యాప్ వాటర్ తో పోలిస్తే బాటిల్స్ వల్ల పర్యావరణ వ్యవస్థపై 1,400 రెట్లు ఎక్కువ ప్రభావం పడుతుందని.. వీటి వెలికితీత కోసం 3,500 రెట్లు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుందని పరిశోధకులు చెప్పారు. పూర్తిగా పంపు నీటిని వినియోగించడం వల్ల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని పరిశోధకులు వెల్లడించారు.

ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని అధ్యయనం సూచించింది. పర్యావరణ, ఆరోగ్య ప్రభావాలను పరిగణనలోకి తీసుకుంటే.. బాటిల్ వాటర్ కంటే ట్యాప్ వాటరే చాలా మంచిదని తమ ఫలితాలు చూపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. ఫిల్టర్ల సాయంతో ట్యాప్ వాటర్ రుచి, వాసనను మెరుగుపరచడంతో పాటు THM స్థాయిలన తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఫిల్టర్ చేసిన పంపు నీరు ఇతర నీటితో పోలిస్తే చాలా ఆరోగ్యకరమని పరిశోధకులు వివరించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Bottled Water: The destruction of bottled packaged water .. Sensational facts in a new study."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0