Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Reception of complaints on ten 'results, formation of inquiry committees

'పది' ఫలితాలపై ఫిర్యాదులు స్వీకరణ, విచారణ కమిటీల ఏర్పాటు

Reception of complaints on ten 'results, formation of inquiry committees

  • 31లోపు నివేదిక అందించాలి.
  • పాఠశాల విద్యాశాఖ డైరెక్టరు

విడుదల చేసిన పదో తరగతి ఫలితాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి పాఠశాల విద్యాశాఖకు ఫిర్యాదులు అందుతున్నాయి. బాగా చదివే తమ పిల్లలకు తక్కువ గ్రేడ్లు వచ్చాయని తల్లిదండ్రులు పలు జిల్లాల్లో విద్యాశాఖ, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విజయవాడలోని నిర్మలా కాన్వెంట్లో సుమారు 130 మంది విద్యార్థులకు గ్రేడులు సరిగ్గా రాలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారులకు ఎస్ఎఫ్ఎస్ఐ ఫిర్యాదు చేసింది. ఇలాంటి ఫిర్యాదులు విద్యాశాఖకు రాష్ట్ర వ్యాప్తంగా అందడంతో స్పందించిన విద్యాశాఖ జిల్లా స్థాయిలో మూడు కమిటీలను ఏర్పాటుచేసింది. జిల్లా స్థాయి ఫిర్యాదుల పరిష్కారాల (డిఎల్టిఆర్సి)కు, తనిఖీలకు హెల్ప్ డెస్క్ కమిటీలను ఏర్పాటు చేయాలని డైరెక్టరు చినవీరభద్రుడు శుక్రవారం సర్క్యులర్ విడుదల చేశారు. డిఎలిఆర్సికి జిల్లా విద్యాశాఖ అధికారి చైర్మన్ గా, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ మెంబర్ కన్వీనర్ జిల్లా సాధారణ పరీక్షల బోర్డు కార్యదర్శి సభ్యులుగా ఉంటారు.. డివిజనల్ స్థాయి తనిఖీ కమిటీ (డిఎల్బసి)కి జిల్లా ఉప విద్యాశాఖ అధికారి చైర్మన్ గా, ఒక మండల అధికారి, ముగ్గురు

ప్రధానోపాధ్యాయులు సభ్యులుగా ఉంటారు. హెల్ప్ డెస్క్ కమిటీని డీఐజ. ఏర్పాటు చేస్తారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పాఠశాలలు తదితరుల నుంచి పదో తరగతి పరీక్షలపై ఫిర్యాదులను ఈ నెల 16 నుంచి 21 వరకు స్వీకరించాలి. వచ్చిన ఫిర్యాదులను డీఎల్బసి కమిటీకి పంపాలి. ఫిర్యాదుల ఆధారంగా పాఠశాలల మార్కుల రికార్డులను డిఎల్బెసి కమిటీ తనిఖీలు చేసి పూర్తిస్థాయి నివేదిక పొందు పరచాలి. ఈ తనిఖీ నివేదికలను డిఎల్ఆర్సి తప్పకుండా విచారణ జరపాలి. ఈ ఫిర్యాదులపై జిల్లావారీ నివేదికను ఈ నెల 31వ తేదీలోపు పాఠశాల విద్యాశాఖ డైరెక్టరుకు సమర్పించాలి.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

2 Responses to "Reception of complaints on ten 'results, formation of inquiry committees"

  1. Sir nenu FA 1and FA2 lo full marks vachayi but results lo 9.5 vachayi sir government action thesukuni ma kashtaniki tagga prathifalam maku isthundhani wait chesthunnam

    Marks online lo enter chesetappudu mistake karogi vundavachu
    What ever may be na Hardwork ki Naku marks isthe I am very very very very happy sir

    ReplyDelete
    Replies
    1. Ma future ki problem vundakudadhu kadha sir ardham chesukuntarani korukuntunnanu.....

      Delete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0