Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Time waste timetable

 ‘టైమ్‌ వేస్ట్‌’ టేబుల్‌!



  • ఉపాధ్యాయులు, పీఈటీలకు అసమతుల్యంగా పనిగంటల కేటాయింపు
  • ఆటలకు సాయంత్రం 4-5 వరకు సమయం
  • అదనపు స్టడీ అవర్‌కు 5-6 వరకు నిర్దేశం
  • దీంతో టీచర్లకు పెరుగుతున్న పని గంటలు
  • దాదాపు 9 గంటలపాటు స్కూళ్లలోనే
  • అసహనం వ్యక్తం చేస్తున్న గురువులు
  • ఆటల అనంతరం స్టడీ అవర్‌పై విస్మయం

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు నిర్దేశించిన టైమ్‌టేబుల్‌ కొన్ని విషయాల్లో అశాస్ర్తీయంగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. బోధనకు, ఆటలకు సమయాన్ని కేటాయించడంలోను, అదేవిధంగా ఉపాధ్యాయులు, పీఈటీలకు పనిగంటల విషయంలోను టైమ్‌ టేబుల్‌ సమతుల్యత పాటించలేదని, దీంతో తమకు ‘టైమ్‌ వేస్ట్‌’ అవుతోందని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జారీ చేసిన టైమ్‌ టేబుల్‌ ప్రకారం.. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉన్నత పాఠశాలలు పనిచేయాలని, ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం 4 నుంచి ఆరుగంటల వరకు ఇష్టమైతే ఉండొచ్చని పాఠశాల విద్యాశాఖ డైరక్టర్‌ చినవీరభద్రుడు శనివారం ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సాయంత్రం 4 గంటల వరకు తరగతులు, ఆ తర్వాత 4 నుంచి 5 వరకు ఆటలు, 5 నుంచి 6 వరకు స్టడీ అవర్‌గా నిర్ణయించారు. అయితే, ఇక్కడే కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఉపాధ్యాయులు అంటున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు విద్యార్థులు ఆడుకున్నాక.. మళ్లీ వారు తరగతి గదిలోకి రావాలి. ఆటల గంట అయిపోయాక మళ్లీ తరగతి గదిలోకి రావడం కొంత ఇబ్బందిగా ఉంటుందని అంటున్నారు. అదే సమయంలో ఉపాధ్యాయులకు సాయంత్రం 4తో క్లాసులు అయిపోతాయి. ఎవరైనా అదనపు తరగతులు తీసుకుని పనిచేసేవారుంటే.. వారు నాలుగు గంటల నుంచి 5 వరకు ఆటల క్లాస్‌ అయిపోయేవరకు వేచి చూసి.. ఆ తర్వాత స్టడీ అవర్‌ను ఎంచుకోవాలి. అంటే మధ్యలో వీరు ఒక గంటసేపు ఖాళీగా కూర్చుని.. ఆ తర్వాత స్టడీ అవర్‌ చూసుకుని ఆరు గంటల వరకు ఉండాల్సి వస్తుంది. అంటే ఉదయం 9 గంటలకు వచ్చి సాయంత్రం 4 గంటల వరకు ఉండి.. ఆ తర్వాత ఒక గంట ఖాళీగా ఉండి.. స్టడీ అవర్‌ నిర్వహించాలి. దీనినిబట్టి తొమ్మిది గంటలపాటు వీరు పాఠశాలలోనే ఉండాల్సి వస్తోంది. మరోవైపు ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లకు ఉదయం 8 నుంచి 9.30కు, మధ్యాహ్నం 2.30నుంచి సాయంత్రం 5 గంటల వరకు అంటే 4 గంటలు మాత్రమే పనిగంటలుగా టైమ్‌టేబుల్‌లో పేర్కొన్నారు. ఇది అసమతుల్యంగా ఉందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. 

ఇలా చేస్తే..

ప్రస్తుతం ఉన్న టైమ్‌ టేబుల్‌కు బదులుగా సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్టడీ అవర్‌, 5 నుంచి 6 గంటల వరకు ఆటలకు సమయం కేటాయిస్తే బాగుంటుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అటు పిల్లలు, ఇటు తమకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పీఈటీలను అవసరమైతే మధ్యాహ్నం 3 గంటలకు రమ్మని 6 గంటల వరకు ఉండమన్నా ఇబ్బంది ఉండదని చెబుతున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Time waste timetable"

  1. Jeethalu velu velu thesukovatam leda private teachers ki rojantha pani no holidays even feastivals ki special classes mari vallaki leni noppi badha meekenduku

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0