Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

DRDO Recruitment 2021

 DRDO Recruitment 2021 : డీఆర్డీఓలో జాబ్స్ .ఎలాంటి ఎగ్జామ్ లేదు కేవలం మార్కుల ఆధారంగానే ఎంపిక.

DRDO Recruitment 2021

తాజాగా ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. సంస్థ నుంచి తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. సంస్థకు చెందిన Terminal Ballistics Research Laboratoryలో 61 ఖాళీలను అప్రంటీస్ విధానంలో భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 

మొత్తం ఖాళీలు : 61

ఎలాంటి ఎగ్జామ్ (Exam) లేకుండా కేవలం మెరిట్ ఆధారంగానే ఎంపిక చేపట్టనున్నట్లు నోటిఫికేషన్లో (Notification) స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు అప్రంటీస్ (Apprenticeship) విధానంలో పని చేయాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు. ఇంకా.. ఎంపికైన వారికి ఉపకారవేతనంగా నెలకు రూ. 8050 (stipend) చెల్లించనున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు డిసెంబర్ 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.

ఖాళీలు, విద్యార్హతల వివరాలు.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 61 అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ కింది ట్రేడ్ లలో ఐటీఐ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ట్రేడ్ ల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.

S.No.ట్రేడ్ఖాళీలు
1డ్రాట్స్ మెన్(Draughtsman (Civil)1
2మెకానిక్ మెకాట్రానిక్స్1
3ఇన్స్ట్రుమెంట్ మెకానిక్1
4మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్3
5మెకానిక్(Embedded Systems and PLC)1
6ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్(సివిల్)1
7హౌస్ కీపర్1
8ఫిట్టర్7
9మెషినిస్ట్4
10టర్నర్3
11కార్పెంటర్1
12ఎలక్ట్రీషియన్8
13ఎలక్ట్రానిక్స్ మెకానిక్8
14మెకానిక్ మోటర్ వెహికిల్2
15వెల్డర్6
16కంప్యూటర్ పెరిఫిరల్స్ హార్డ్ వేర్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్2
17కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్3
18డిజిటల్ ఫొటోగ్రాఫర్3
19సెక్రెటేరియల్ అసిస్టెంట్3
20స్టేనోగ్రాఫర్1
అప్లై చేయు విధానము
  • Step 1: అభ్యర్థులు NAPS పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 
  • Step 2: అభ్యర్థులు apprenticeshipindia.org పోర్టల్ లో రిజిస్టర్ అయ్యి అన్ని కావాల్సిన సర్టిఫికేట్లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. 
  • Step 3: అనంతరం అభ్యర్థులు టెన్త్ క్లాస్ మార్క్ షీట్, ఐటీఐ పాస్ సర్టిఫికేట్&మార్క్స్ షీట్, కాస్ట్ సర్టిఫికేట్, ఐడీ ప్రూఫ్ స్కానింగ్ కాపీలను సింగిల్ పీడీఎఫ్ ఫైల్ లో admintbrI@tbrl.drdo.in మెయిల్ లో పంపించాల్సి ఉంటుంది. 
  • Step 4: ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు డిసెంబర్ 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
 ఎంపిక చేయు విధానం
  • అభ్యర్థులు విద్యార్హత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేపడుతారు. ఒక వేళ మార్కులు సమానంగా ఉంటే కింది తరగతుల్లో అభ్యర్థులు సాధించిన మార్కులను ప్రామాణికంగా తీసుకుంటారు. 
  • ఎంపికైన అభ్యర్థులకు ఈ-మెయిల్, ఎస్ఎంఎస్, ఫోన్ ద్వారా ట్రైనింగ్ కు సంబంధించిన సమాచారం ఇస్తారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "DRDO Recruitment 2021"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0