What are teachers doing?
టీచర్లు ఏం చేస్తున్నారు?
నేషనల్ అచీవ్మెంట్ సర్వే
పాఠశాల విద్యాశాఖలో ఉపాధ్యాయులు బోధన, బోధనేతర వ్యవహారాల్లో ఏ విధంగా పాల్గొంటున్నారు. ఎంత సమయం వెచ్చిస్తున్నారనే అంశాలపై సర్వే నిర్వహిస్తున్నారు. కేంద్ర విద్యాశాఖ విభాగమైన డిపార్లమెంట్ ఆఫ్ స్కూల్ - ఎడ్యుకేషన్ అండ్ బిటరసీ ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రంలో 'నేషనల్ అచీవ్మెంట్ సర్వేను చేపడుతున్నారు. సర్వేలో భాగంగా ఉపాధ్యాయులు, పాఠశా లల హెడ్ మాస్టర్లు, ప్రిన్సిపాళ్లు, స్కూల్ ఇన్చార్జులకు వేర్వేరుగా రెండు పాఠాలు సిద్ధం చేశారు. వీటిలో సిబ్బంది విద్యార్హతల నుంచి పూర్తి వివరాలు సేకరించ దంతోపాటు, వారు రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానాన్ని ఆమలు చేయడంతోపాటు, జాతీయ స్థాయిలో పాఠశాల వి ద్యాశాఖకు సంబంధించి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలాగే బోధనా సిబ్బందికి శిక్షణ కార్యక్రమా టు చేపడుతోంది. ఈ నేపథ్యంలో తాజా సర్వే ద్వారా మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని భావిస్తోంది.
అన్ని వివరాలతో సమగ్రంగా
రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్ల వివరా లను సమగ్రంగా సర్వే ద్వారా సేకరించనున్నారు. ఇన్ లైన్లో సర్వే కోసం రెండు గూగుల్ ఫామ్స్ ఏర్పాటు చేశారు. వీటిలో ఉపాధ్యాయుల క్వాలిఫికేషన్లు ప్రాం తం, బోధనానుభవం తదితర వివరాలతోపాటు, విద్యా సంవత్సరంలో పని దినాల సంఖ్య తరగతి గది బోధన, మధ్యాహ్న భోజన నిర్వహణ తదితర అంశా లపైనా వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే తరగతి గదుల్లో ఏవైనా ఇబ్బందులుంటే వాటిని తెలపాల్సి ఉంటుంది. వీటితోపాముగా కల్చరల్ ప్రోగ్రామ్స్, గేమ్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్, డాన్స్, లైబ్రరీ, యోగా, మెడిటేషన్ వంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్న సమయం తదితరాలను పేర్కొనాలి.
బోధనాటంకాలపై దృష్టి
పాఠశాల విద్యలో ఉపాధ్యాయులకు రోజు వారి బోధనలో ఎదురవుతున్న ఆటంకాలను తొలగించి, ఎక్కువ సమయం అకడమిక్ వ్యవహారాలకు కేటాయించేలా చూడటం ఈ సర్వే ఉద్దేశం. రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ప్రకారం విద్యార్ధులకు సంపూర్ణ బోధన అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుండే, ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల వివరాలు సేకరించడం ద్వారా ఖాళీల భర్తీ బోధనేతర పనులకు ఇతర సిబ్బందిని కేటాయించడం వంటి ఇంకాలపై కేంద్రం పలు సూచనలు చేయనుంది. అలాగే ఉపాధ్యాయులకు బోధనాంశాలపై మరిన్ని శిక్షణకార్యక్రమాలను జాతీయ స్థాయిలో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయనుంది.ప్రిన్సిపాళ్లు నింపాల్సిన ఫాంలో ఉపాధ్యాయులకు ఇస్తున్న సిలవులు, ప్రభుత్వ కార్యక్రమాలు, ఇతర సమస్యలు నమోదు చేయాలి.
0 Response to "What are teachers doing?"
Post a Comment