Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The sinking "unpredictable" storm

 ముంచుకొస్తున్న "అసనిపాతం" తుఫాన్

The sinking "unpredictable" storm

  • తీవ్ర తుపానుగా మారిన వాయుగుండం
  • రేపటినుంచి రెండురోజులు భారీ వర్షాలు
  • ఇప్పటికే ఈదురుగాలుల బీభత్సం మొదలు సముద్రంలో వేటకు .వెళ్లొద్దు
  • ఉత్తరాంధ్రపై ప్రభావం ఎక్కువ
  • వాతావరణశాఖ హెచ్చరిక అప్రమత్తమైన ప్రభుత్వం

ఆగ్నే య బంగాళాఖాతంలో కొనసా గుతున్న ఆసని తుపాను తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చ రించింది. ఈ నెల 10వ తేదీ నాటి కి క్రమంగా ఉత్తర కోస్తాంధ్ర ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చిన అనంతరం ఇది దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యం వైపు కదులుతూ వాయు వ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరం చేరే అవకాశముంది. దీని ప్రభావంతో మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం వరకు ఉత్తరాంధ్రలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40-60 కిమీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ల వద్దన్నారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం నుంచి నిప్పు లు చెరిగిన సూరీడు మధ్యాహ్నానికి మబ్బులచాటుకు వెళ్లిపోయాడు. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. సాయంత్రం 5 తరువాత పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచాయి. ఆసని తుపాను ఆగ్నేయ దిశగా బంగాళాఖాతంలో గంటకు 13 కి.మీ వేగంతో కదులుతోంది. వాయువ్య దిశగా కదిలి అదే ప్రాంతంపై అక్షాంశం 11.4 డిగ్రీల ఎన్... రేఖాంశం 89.1డిగ్రీల ఈ, పశ్చిమవాయువ్యంగా 480 కి.మీ. కార్ నికోబార్ (నికోబార్ దీవులు), పోర్ట్ బ్లెయిర్ (అండమాన్ దీవులు)కి పశ్చిమాన 400 కి.మీ., విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)కి ఆగ్నేయంగా 940 కి.మీ, పూరీ (ఒడిశా)కి ఆగ్నేయంగా 1000 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆది వారం అర్థరాత్రి సమయానికి వాయవ్య దిశగా కదులుతూ తూర్పు మధ్య బం గాళాఖాతంపై తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొం ది. ఈనెల 10వ తేదీ సాయంత్రానికి వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తరాం ధ్ర -ఒడిశా తీరాలకు ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత, ఇది ఈశాన్య దిశగా తిరిగి ఒడిషా తీరానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం వైపు వెళ్లే అవకాశం ఉన్నట్లు వాతా వరణశాఖ అధికారులు తెలిపారు.

తోడుగా ఉపరితల ద్రోణి

దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ దాని పొరుగు ప్రాంతాలపై సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, వీటి ఫలితంగా రాష్ట్రంలో రా గల మూడు రోజుల వరకు ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాంలలో ఆదివారం పలుప్రాంతాల్లో బలమైన గాలులు వీయడంతో పాటు తేలికపాటి వర్షాలు కురి శాయి. సోమవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. మరియు మంగళవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు 1 లేక 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. పెనుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్లు గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.

అసని’ అంటే

ఐంఎడీ నామకరణం చేసిన ‘అసని’ శ్రీలంక సూచించింది.

 సిన్హళ భాషలో అసని అంటే *తీవ్ర కోపం* అని అర్థం వస్తుందని ఐఎండీ తెలిపింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The sinking "unpredictable" storm"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0