Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Chief Minister's review of gurukula schools and government hostels day-to-day. Details.

 గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాల్లో నాడు-నేడుపై ముఖ్యమంత్రి గారి సమీక్ష. వివరాలు.

Chief Minister's review of gurukula schools and government hostels day-to-day. Details.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాల్లో నాడు-నేడుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడి​ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్ల పర్యవేక్షణపై సీఎం ఆదేశాలు జారీ చేశారు. గురుకుల పాఠశాలల్లో అకడమిక్‌ వ్యవహారాల పర్యవేక్షణ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలోకి తీసుకురావాలన్నారు. మండలాల్లో అకడమిక్‌ వ్యవహారాలు చూస్తున్న ఎంఈఓకు సంబంధిత మండలంలోని గురుకుల పాఠశాలల అకడమిక్‌ బాధ్యతలను అప్పగించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే..

 • గురుకుల పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలి.
 • మండలాల్లో ఇద్దరు ఎంఈఓల నియామకం ద్వారా ఎలా పర్యవేక్షణ చేస్తున్నామో ఆ తరహాలోనే ఇక్కడ కూడా పర్యవేక్షణ జరగాలి.
 • దీనికోసం ఎస్‌ఓపీలు రూపొందించాలి.
 • పర్యవేక్షణకోసం ప్రత్యేక యాప్‌కూడా రూపొందించాలి.
 • మౌలిక సదుపాయాలు, భోజనం నాణ్యత, నిర్వహణ తదితర అంశాలపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలి.
 • గురుకుల పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్‌ హాస్టళ్లపై ఈ అధికారులతో పర్యవేక్షణ చేయాలి.
 • పర్యవేక్షణ వరకూ వీటిని ఇంటిగ్రేట్‌ చేయాలి.
 • ఒక్కో అధికారికి ప్రత్యేక పరిధిని నిర్ణయించి పర్యవేక్షణ చేయించాలి.
 • మండలాల్లో స్కూళ్ల నిర్వహణ, పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా నియమిస్తున్న రెండో ఎంఈవోకు కూడా విధివిధానాలు ఖరారుచేయాలి.
 • గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో నాడు - నేడు కింద చేపట్టనున్న పనులపై ప్రతిపాదనలు వివరించిన అధికారులు.
 • టాయిలెట్లు, విద్యుద్దీకరణ, ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు, పెయింటింగ్, మరమ్మతులు, ప్రహరీ గోడలు, మస్కిటో ఫ్రూఫింగ్‌ పనులు.
 • సిబ్బందికి, విద్యార్థులకు ఫర్నిచర్‌ కల్పనలో భాగంగా డెస్క్‌లు, బంకర్‌ బెడ్స్, స్టడీ టేబుల్స్, ఛైర్లు, ఆఫీసు టేబుళ్లు, లైబ్రరీ రాక్స్, షూ రాక్స్, డైనింగ్‌ టేబుల్, గార్బేజ్‌ బిన్స్‌.
 • కిచెన్‌ ఆధునీకరణలో భాగంగా స్టోరేజీ రాక్స్, గ్యాస్‌ స్టౌవ్స్, గ్రైండర్, పూరి మేకింగ్‌ మెషీన్, ప్రెషర్‌ కుక్కర్, ఇడ్లీ కుక్కర్, చిమ్నీ, కుకింగ్‌ వెసల్స్, డస్ట్‌ బిన్స్‌.
 • 55 ఇంచీల స్మార్ట్‌ టీవీతో పాటు క్రీడాసామగ్రి, మరియు లైబ్రరీ బుక్స్‌ ఏర్పాటుకోసం ప్రతిపాదనలు తయారుచేశామన్న అధికారులు.
 • గురుకుల పాఠశాలల్లో మూడు విడతలుగా నాడు - నేడు పనులు చేయాలని సీఎం ఆదేశం.
 • 2 విడతలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లలో నాడు -నేడు.
 • పారిశుద్ధ్యం, పరిశుభ్రతలపైనా దృష్టిపెట్టాలన్న సీఎం.
 • డ్రైనేజీని లింక్‌ చేయడంపైనా దృష్టిపెట్టాలన్న సీఎం.
 • హాస్టల్‌ పిల్లలకు ఇచ్చే కాస్మోటిక్స్ సహా వస్తువులన్నీ నాణ్యతతో ఉండాలన్న సీఎం.
 • విద్యాకానుకతో పాటు వీటిని కూడా అందించడానికి చర్యలు తీసుకోవాలన్న సీఎం.
 • అన్ని ప్రభుత్వ వసతి గృహాల్లో భోజనంలో నాణ్యత పెంచాలని సీఎం ఆదేశాలు.
 • ప్రతిరోజూ ఒక మెనూ ఇవ్వాలి.
 • ఈమేరకు ప్రతిపాదనలు తయారుచేసి ఇవ్వాలి.
 • గురుకుల పాఠశాలలు, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లలో దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు.
 • ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు పెట్టే భోజనం అత్యంత నాణ్యతతో ఉండాలని స్పష్టంచేశారు.
 • హాస్టళ్లలో టాయిలెట్ల నిర్వహణ, అలాగే మౌలిక సదుపాయాల నిర్వహణ బాగుండాలి.
 • హాస్టళ్లకు తప్పనిసరిగా ఇంటర్నెట్‌ సదుపాయం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
 • క్రమం తప్పకుండా వైద్యులు హాస్టళ్లకు వెళ్లి, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై పర్యవేక్షణ చేయాలి.
 • ఈ పర్యవేక్షణకు ప్రత్యేక యాప్‌ను కూడా తయారుచేస్తున్నట్టు వెల్లడించిన అధికారులు.
 • విలేజ్‌క్లినిక్స్, స్థానిక పీహెచ్‌సీలతో ప్రభుత్వ హాస్టళ్లను మ్యాపింగ్‌ చేయాలి.
 • హాస్టళ్ల నిర్వహణలో ఖాళీలను కూడా గుర్తించి, భర్తీచేయాలి.
 • పై నిర్ణయాలకు సంబంధించి కార్యాచరణ సిద్ధంచేసి తనకు నివేదించాలని ఆధికారులకు సీఎం ఆదేశం.

ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పీడిక రాజన్నదొర, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ ఎస్‌ రావత్, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Chief Minister's review of gurukula schools and government hostels day-to-day. Details."

Post a Comment