Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Grama & Ward Sachivalayam 2023 Jobs

 AP Grama & Ward Sachivalayam 2023 Jobs : 14,523 గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌.. ఏప్రిల్‌లో పరీక్షలు.. పూర్తి వివరాలు

AP Grama & Ward Sachivalayam 2023 Jobs

ప్రాథమిక సమాచారం మేరకు.. మొత్తం 20 కేటగిరీల్లో దాదాపు 14,523 పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా 1,26,728 గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల భర్తీకి చేసిన విషయం తెల్సిందే.

ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలోనే రాతపరీక్షలతో సహా మొత్తం భర్తీ ప్రక్రియను చేపడతారు. ఈ మేరకు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టాలని కోరుతూ గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఇటీవలే పంచాయతీరాజ్‌ శాఖకు లేఖ కూడా రాసింది. అలాగే ఏయే శాఖల్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనే వివరాలను కూడా ఆ లేఖలో పేర్కొంది. మొత్తం మూడు నెలల వ్యవధిలోనే ఈ ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు వెల్లడించారు.

ప్రాథమిక సమాచారం మేరకు కేటగిరీల వారీగా ఉద్యోగ ఖాళీల వివరాలుఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ రాత పరీక్షలకు సంబంధించిన ఉమ్మడి సిలబస్ అంశాలు 

 • జనరల్ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్.
 • క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్.
 • ఇంగ్లిష్-తెలుగు కాంప్రెహెన్షన్
 • జనరల్ ఇంగ్లిష్
 • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు.
 • జనరల్ సైన్స్, దైనందిన జీవితంలో వాటి అనువర్తనాలు, 
 • శాస్త్ర సాంకేతిక రంగాల్లో సమకాలీన పరిణామాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్
 • పర్యావరణం - సుస్థిరాభివృద్ధి
 • భారతదేశ చరిత్ర, సంస్కృతి, ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేక దృష్టి
 • భారత, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక అంశాలు
 • భారత రాజకీయ వ్యవస్థ, పరిపాలన, రాజ్యాంగ అంశాలు, 73,74వ రాజ్యాంగ సవరణలు, పబ్లిక్ పాలసీ, సంస్కరణలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేక దృష్టి
 • సుపరిపాలన, ఈ గవర్నెన్స్
 • సమాజం, సామాజిక న్యాయం, హక్కులు - సమస్యలు
 • భారత ఆర్థిక వ్యవస్థ, భారత ఆర్థిక సర్వే, కేంద్ర బడ్జెట్
 • ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక సర్వే, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్
 • ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం-2014, పరిపాలన, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, న్యాయపరమైన సమస్యలు
 • మహిళా సాధికారత, ఆర్థిక స్వాతంత్య్రం, స్వయం సహాయక బృందాలు, సమాజ ఆధారిత సంస్థలు-మహిళా అభ్యున్నతి.
 • జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ ప్రాముఖ్యత గల వర్తమాన అంశాలు.

గణితంపై పట్టున్న అభ్యర్థులకు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ తేలికే అని చెప్పొచ్చు. హైస్కూల్ స్థాయి మ్యాథమెటిక్స్‌లోని ప్రాథమిక అంశాలపై అవగాహన పెంచుకోవడం ద్వారా ఈ విభాగాల్లో మంచి మార్కులు పొందొచ్చు.

అర్థమెటిక్‌కు సంబంధించి పర్సంటేజెస్, యావరేజెస్, రేషియో-ప్రపోర్షన్, ప్రాఫిట్-లాస్, సింపుల్-కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్-వర్క్, టైమ్-డిస్టెన్‌స, పర్ముటేషన్‌స-కాంబినేషన్‌స, ప్రాబబిలిటీ, మిక్షర్ అండ్ అలిగేషన్స్, పార్టనర్‌షిప్‌పై దృష్టిపెట్టాలి. భాగహారాలు, కూడికలు, తీసివేతలు వంటి ప్రాథమిక అంశాలను నోటితో గణించే విధంగా ప్రాక్టీస్ చేయాలి. సంఖ్యల వర్గాలు, ఘనాలు గుర్తుంచుకోవాలి. వీటివల్ల సింప్లిఫికేషన్‌స, నంబర్ సిరీస్ ప్రశ్నల సాధనలో సమయం ఆదా అవుతుంది.

జామెట్రీ, ఆల్జీబ్రా, ట్రిగనోమెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, మెన్సురేషన్ టాపిక్స్‌లో ప్రాథమిక సూత్రాల ద్వారా సదరు అంశాల నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానాలు గుర్తించే వీలుంది.

డేటా ఇంటర్‌ప్రిటేషన్(డీఐ)లో పట్టికలు, గ్రాఫ్‌ల రూపంలో ఉండే సమాచారాన్ని క్రోడీకరించి ఆయా గ్రాఫ్‌ల కింద ఇచ్చే ప్రశ్నలను పరిష్కరించాలి. ఈ డీఐ ప్రశ్నలు పర్సంటేజెస్, యావరేజెస్, రేషియో ప్రపోర్షన్ వంటి అర్థమెటిక్ చాప్టర్ల మేళవింపుగా ఉంటాయి. డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో పట్టు కోసం టేబుల్స్, బార్ చార్‌ట్స, పై చార్‌ట్స మొదలైన వాటిని విస్తృతంగా ప్రాక్టీస్ చేయాలి.

మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ :

అభ్యర్థుల విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఉద్దేశించిన విభాగం రీజనింగ్. వివిధ సందర్భాలలో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, సంక్లిష్ట పరిస్థితుల్లో సమస్యలను తెలివిగా పరిష్కరించే నేర్పును పరీక్షించేందుకు మెంటల్ ఎబిలిటీ విభాగం ఉపయోగపడుతుంది. కోడింగ్, డీ-కోడింగ్, నంబర్ సిరీస్, పోలికలు, ర్యాంకింగ్, రక్త సంబంధాలు, సీటింగ్ అరేంజ్‌మెంట్స్, వెన్ చిత్రాలు, పజిల్స్, క్యాలెండర్, గడియారాలు, రేఖాచిత్రాల గణన, తీర్మానాలు(సిలాయిజమ్స్), దిక్కులు, పాచికలు, దీర్ఘఘనం, చిహ్నాలు, వర్డ్ ఫార్మేషన్, గణిత గుర్తులు, దత్తాంశ విశ్లేషణలను బాగా ప్రాక్టీస్ చేయాలి.

ఇంగ్లిష్-తెలుగు కాంప్రెహెన్షన్ సెక్షన్ల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. ఆయా భాషల్లో ఒక పేరా ఇచ్చి.. దానికింద ప్రశ్నలు అడుగుతారు. ఇచ్చిన పేరాను వేగంగా చదివి అర్థంచేసుకొని సమాధానాలు రాసే విధంగా సన్నద్ధమవ్వాలి.

జనరల్ ఇంగ్లిష్ :

హైస్కూల్ స్థాయి ఇంగ్లిష్ గ్రామర్‌పై పట్టుతోపాటు వొకాబ్యులరీపై అవగాహన ఉంటే జనరల్ ఇంగ్లిష్ సులువైన విభాగం. రీడింగ్ కాంప్రెహెన్షన్, యాంటానిమ్స్, సినానిమ్స్, స్పాటింగ్ ద ఎర్రర్స్‌పై దృష్టిపెట్టాలి. వీటితోపాటు స్పెల్లింగ్‌స, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, టెన్సెస్, ప్రిపోజిషన్‌స, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, వొకాబ్యులరీ, రీ రైటింగ్ ద సెంటెన్‌స, రీ అరెంజ్ ది సెంటెన్స్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్, బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్ నిబంధనలు ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లిష్‌లో పట్టు కోసం మొదట బేసిక్ గ్రామర్‌పై అవగాహన పెంచుకోవాలి. టెన్సెస్, సెంటెన్స్ ఫార్మేషన్, యాక్టివ్-ప్యాసివ్ వాయిస్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ వంటి ముఖ్యాంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి. రీడింగ్ కాంప్రెహెన్షన్, వొకాబ్యులరీల్లోనూ పూర్తిస్థాయిలో నైపుణ్యం పొందాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Grama & Ward Sachivalayam 2023 Jobs"

Post a Comment