Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The good news for Indians is premium processing for certain types of visas and green cards

భారతీయులకు గుడ్ న్యూస్ కొన్ని రకాల వీసాలు, గ్రీన్‌కార్డులకు ప్రీమియం ప్రాసెసింగ్‌

The good news for Indians is premium processing for certain types of visas and green cards


భారత్‌లో బిజినెస్‌ వీసాల జారీ వేగవంతానికి చర్యలు

వాషింగ్టన్‌/న్యూఢిల్లీ, జనవరి 17: కొన్ని రకాల వీసాలు, గ్రీన్‌కార్డుల ప్రక్రియలను ప్రీమియం ప్రాసెసింగ్‌లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. తమ వలసవిభాగం వ్యవస్థపై ఉన్న బరువును తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా పౌరసత్వ-వలససేవల సంస్థ(యూఎ్‌ససీఐఎస్‌) స్పష్టం చేసింది. ''ఈ ఏడాది మార్చిలో ఐ-765 దరఖాస్తు పెండింగ్‌లో ఉన్న ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ) ఎఫ్‌-1, స్టెమ్‌ ఓపీటీ ఎఫ్‌-1 విద్యార్థులకు ప్రీమియం ప్రాసెసింగ్‌ను మొదలుపెడతాం. ఏప్రిల్‌లో తిరిగి ఇవే రకం వీసాల్లో ఐ-765 దరఖాస్తును నింపుతున్న విద్యార్థులను ప్రీమియం ప్రాసెసింగ్‌ విభాగంలోకి తీసుకొస్తాం'' అని తెలిపింది.

ఇన్నాళ్లూ ఐ-129, ఐ-140 దరఖాస్తులను నింపే అభ్యర్థులకు మాత్రమే ప్రీమియం ప్రాసెసింగ్‌ అందుబాటులో ఉండేది. మరోవైపు.. భారత్‌లో బిజినెస్‌ వీసాల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు పలు చర్యలను తీసుకుంటున్నామని, ఈ దిశగా ఇప్పటికే ప్రగతిని సాధించామని అమెరికా పేర్కొంది. భారత్‌లో తమ సిబ్బందిని సైతం గణనీయంగా పెంచినట్లు అమెరికా ప్రపంచమార్కెట్ల వాణిజ్య విభాగ సహాయ కార్యదర్శి అరుణ్‌ వెంకటరామన్‌ స్పష్టం చేశారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The good news for Indians is premium processing for certain types of visas and green cards"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0