Why put a blob? With which finger do you put a blob, you will get longevity and wealth?
బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఆయుష్షు, సంపద వస్తుంది?
బొట్టు.. బొట్టు పెట్టుకోవడం మన సనాతన సాంప్రదాయపు విశిష్ట లక్షణం. బొట్టు పెట్టుకున్న వాళ్ళ మొహం తేజోవంతంగా, చక్కని కళతో కనిపిస్తుంది. బొట్టు లేని మొఖాన్ని చూడకూడదు అని సాంప్రదాయాలు పాటించే చాలా మంది చెబుతుంటారు.
ముఖ్యంగా మహిళలు నుదుటన బొట్టు లేకుంటే అరిష్టంగా భావించేవాళ్ళు నేటికీ ఉన్నారు . ముఖ్యంగా వివాహితలైన స్త్రీలు బొట్టు లేకుండా ఉంటే అది ఏ మాత్రం మంచిది కాదని చెప్తారు.
బొట్టు పెట్టుకోవటం వెనుక అనేక కారణాలు
అయితే మహిళలు నుదుట కుంకుమ తిలకం పెట్టుకోవడం ఒక ఆచారమే కాదు అందుకు అనేక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని చెబుతారు. ఇక బొట్టు పెట్టుకోవడం వెనుక ఉన్న కారణాలలో కొన్నింటిని చూస్తే ... పురాణాల్లో కూడా బొట్టు గురించి చాలా ప్రసిద్ధమైన విషయాలు ఉన్నాయని చెబుతారు. పద్మపురాణంలో, ఆగ్నేయ పురాణంలో, పరమేశ్వర సంహిత లో నుదుటిమీద కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల భర్త ఆయుష్షు పెరుగుతుందని చెప్పబడింది.
బ్రహ్మస్తానంలో బొట్టు పెట్టుకోవటం శుభాలకు సంకేతం
అంతేకాదు మన దేహంలోని ప్రతి శరీర అవయవానికి ఒక్కొక్క అధిదేవతలు ఉన్నారని, ఇక నుదుటికి అధిదేవత బ్రహ్మ దేవుడు అని చెబుతారు. బ్రహ్మ స్థానమైన నుదుటిపై బొట్టు పెట్టుకోవడం వల్ల సకల శుభాలు జరుగుతాయని చెబుతారు. బొట్టు లేని ముఖం, ముగ్గు లేని ఇల్లు స్మశానంతో సమానం అని పెద్దలు చెప్తారు. అందుకే స్త్రీలు బొట్టు పెట్టుకోవటం తప్పనిసరి.
బొట్టు పెట్టుకోవటం వల్ల ఉపయోగాలివే
కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల శరీరాన్ని అది చల్లబరుస్తుంది. మహిళలు కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల వారు చక్కనైన లైంగిక సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. నుదుటన పెట్టుకున్న కుంకుమబొట్టు మెదడుని ఎంతో ఉత్సాహంగా ఉంచుతుంది. నొసటి మీద వలయాకారంలో బొట్టు పెట్టుకోవడం వల్ల అక్కడ ఉన్న నాడులన్నీ చక్కగా పనిచేసి ఏకాగ్రతను పెరిగేలా చేస్తాయి. బొట్టు పెట్టుకుంటే మానసికంగానూ చాలా ఉత్సాహంగా ఉంటుంది.
ఈ పనులు చేసేటప్పుడు బొట్టు లేకుంటే ప్రయోజనం ఉండదు
ఇవి మాత్రమే కాకుండా నుదుట కుంకుమ బొట్టు పెట్టుకోవడం అనేక క్రతువులు చేసేటప్పుడు తప్పనిసరి. పుణ్యస్నానాలు చేసేటప్పుడు, దానధర్మాలు చేసేటప్పుడు, యజ్ఞయాగాదులు, దేవతార్చన నిర్వహిస్తున్నప్పుడు, పితృ కర్మలను ఆచరించే టప్పుడు నుదుటన బొట్టు పెట్టుకోవడం తప్పనిసరి. నుదుటన బొట్టు లేకుండా ఈ కార్యక్రమాలు ఏమి చేసినా అవి ఎటువంటి ఫలితాలు ఇవ్వవు.
బొట్టు ఏ వేలితో పెట్టుకోవాలి .. ఎలా పెట్టాలంటే
ఇదిలా ఉంటే ఇక బొట్టు పెట్టుకోవడంలో కూడా అనేక విధానాలు ఉంటాయి. ఏ వేలితో బొట్టు పెట్టుకోవచ్చు? ఏ వేలితో బొట్టు పెట్టుకోరాదు? అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. మనం బొట్టు పెట్టుకోవాలంటే మధ్య వేలితో పెట్టుకోవాలి. అదే ఇతరులకు బొట్టు పెట్టాలంటే చూపుడు వేలితో పెట్టాలి అలా కాకుండా మధ్యవేలుతో కానీ, ఉంగరపు వేలుతో కానీ బొట్టు పెడితే ఎదుటి వారి కర్మలు మనకు వచ్చిపడతాయి. అందుకే చూపుడువేలితో ఎదుటివారికి బొట్టు పెట్టాలని చెబుతారు.
బొట్టు పెట్టుకుంటే కలిగే ఫలితం ఇదే
ఇక దేవతల ప్రతిమలకు, ఫోటోలకు బొట్టు పెట్టేటప్పుడు ఉంగరం వేలితో బొట్టు, గంధం వంటివి పెట్టాలి. పొరపాటున కూడా మధ్యవేలుతో పెట్టకూడదు. మధ్యవేలుతో మనం బొట్టు పెట్టుకోవడం వల్ల ఆయుష్షు, సంపద రెండూ వస్తాయని చెబుతారు. ఇక బొటన వేలుతో బొట్టు పెట్టుకుంటే పుష్టి కలుగుతుందని చెబుతారు. మొత్తంగా చూస్తే కచ్చితంగా మహిళలు బొట్టు పెట్టుకోవాలి. మహిళలు మాత్రమే కాదు పురుషులు కూడా బొట్టు పెట్టుకోవటం ఎంతో మంచిది.
0 Response to "Why put a blob? With which finger do you put a blob, you will get longevity and wealth?"
Post a Comment