Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Famous Sri Rama Temples. A must visit on Sri Rama Navami.

ప్రసిద్ధమైన శ్రీరాముని ఆలయాలు. శ్రీరామ నవమి నాడు తప్పక సందర్శించాలట.

Famous Sri Rama Temples. A must visit on Sri Rama Navami.

ఉత్తర ప్రదేశ్‌లో ఉన్న"అయోధ్య" దేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో అనేక దేవాలయాలు ఉన్నాయి. చాలా మంది భక్తులు రామనవమి రోజున అయోధ్యను సందర్శించాలనుకుంటారు. అయితే మీకు తెలుసా అయోధ్య మాత్రమే కాదు, దేశంలో మరికొన్ని చోట్ల చాలా ప్రత్యేకమైన శ్రీరాముని ఆలయాలు ఉన్నాయి. అవేంటంటే..?  

వాస్తవానికి అయోధ్య రాముడి రాజధాని, కానీ అతని 14 సంవత్సరాల అజ్ఞాతవాస సమయంలో అయోధ్య రాజు రాముడు కొన్ని ప్రదేశాలను సందర్శించాడు. రామ నవమి సందర్భంగా ఈ ఆలయాలను సందర్శించడం ద్వారా చాలా శుభప్రదంగా ఉంటుందని భావిస్తారు. అందుకే శ్రీరాముడు కొలువై ఉన్న కొన్ని ప్రసిద్ధ ఆలయాలను గురించి తెలుసుకుందాం.

మహారాష్ట్రలో కాలారం దేవాలయం.

మహారాష్ట్రలోని నాసిక్‌లోని కాలరామ్ ఆలయం శ్రీరాముడు, భార్య సీత , సోదరుడు లక్ష్మణులకు అంకితం చేశారు. రాముడు వనవాస సమయంలో పంచవటిలో ఉండేవాడు. అందుకే ఈ ప్రదేశానికి విశేష ప్రాధాన్యత ఉంది. విశ్వాసాల ప్రకారం, సర్దార్ రంగ్రు ఒధేకర్ తన కలలో గోదావరి నదిలో నల్లని రాముడి విగ్రహాన్ని చూశాడు. మరుసటి రోజు ఉదయం విగ్రహం వాస్తవానికి గోదావరి నది ఒడ్డున కనిపించింది. దానిని బయటకు తీసి కాలారం దేవాలయంలో ప్రతిష్టించారు. అప్పటి నుంచి ఆ ఆలయంలో పూజలు మొదలయ్యాయి. 

మధ్యప్రదేశ్ లో రామ్ రాజా ఆలయం.

మధ్యప్రదేశ్‌లోని ఓర్చాలో రాముడి గొప్ప ఆలయం ఉంది. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే..? దేశంలోనే శ్రీరాముడు రాజుగా పూజలందుకుంటున్న ఏకైక దేవాలయం. దీనితో పాటు, పూజానంతరం గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తూ శ్రీరాముడికి గన్ సెల్యూట్ చేస్తారు. రామ నవమి రోజున ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు భక్తులు. 

జమ్మూ & కాశ్మీర్ లో రఘునాథ్ ఆలయం.

జమ్మూలో ఉన్న మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. కానీ శ్రీరాముని రఘునాథ్ ఆలయం కూడా జమ్మూలో ఉంది. అదే సమయంలో, శ్రీ రాముడితో పాటు, అనేక మంది దేవతల విగ్రహాలు కూడా ఈ ఆలయంలో ఉన్నారు. రామ నవమి సందర్భంగా రఘునాథ్ ఆలయాన్ని సందర్శించడం ఆనవాయితీగా వస్తోంది.  

తమిళనాడులో రామస్వామి దేవాలయం

దక్షిణ భారతదేశంలో రాముడికి గొప్ప ఆలయం ఉంది. శ్రీరాముడు తన నలుగురు సోదరులు లక్ష్మణ, భరత, శత్రుఘ్నలతో కలిసి తమిళనాడులోని రామస్వామి ఆలయంలో ఉన్నాడు. ఈ ఆలయ గోడలపై రామాయణ ఘట్టాలు అందమైన శిల్పాల రూపంలో అలంకరించి ఉంటాయి. రామ నవమి రోజున రామస్వామి ఆలయానికి వెళ్లడం వల్ల గొప్ప అనుభూతిని కలిగిస్తుందని భక్తులు భావిస్తుంటారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Famous Sri Rama Temples. A must visit on Sri Rama Navami."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0