Good news for Sankranti pilgrims. 32 more special trains, full details
సంక్రాంతికి ఊళ్లకు వెళ్లేవారికి శుభవార్త. మరో 32 ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే
సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లాలనుకునేవారికి రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే 32 ప్రత్యేక రైళ్లను నడపనుంది. సొంత ఊళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం పలు మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. విశాఖపట్నం-కర్నూలు సిటీ, శ్రీకాకుళం-వికారాబాద్, సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-కాకినాడ టౌన్, సికింద్రాబాద్-నర్సాపూర్, సికింద్రాబాద్-బ్రహ్మపుర్, బ్రహ్మపుర్-వికారాబాద్ రూట్లలో ఈ రైళ్లు నడవనున్నాయి. జనవరి 7వ తేదీ నుంచి జనవరి 27 మధ్య వివిధ తేదీల్లో ఈ రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయి. ఈ ప్రత్యేక రైళ్లన్నింటిలోనూ ఫస్ట్ ఏసీ, సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
ప్రత్యేక రైళ్ల వివరాలు.
సికింద్రాబాద్ – బ్రహ్మపుర్ (07089) – జనవరి 7, 14 తేదీల్లో
బ్రహ్మాపుర్ – వికారాబాద్ (07090) – జనవరి 8, 15 తేదీల్లో
వికారాబాద్ – బ్రహ్మపుర్ (07091) – జనవరి 9, 16 తేదీల్లో
బ్రహ్మాపూర్ – సికింద్రాబాద్ (07092) – జనవరి 10, 17 తేదీల్లో
విశాఖపట్నం – కర్నూలు సిటీ (08541) – జనవరి 10, 17, 24 తేదీల్లో
కర్నూల్ సిటీ – విశాఖపట్నం (08542) – జనవరి 11, 18, 25 తేదీల్లో
శ్రీకాకుళం – వికారాబాద్ (08547) – జనవరి 12, 19, 26 తేదీల్లో
వికారాబాద్ – శ్రీకాకుళం (08548) – జనవరి 13, 20, 27 తేదీల్లో
సికింద్రాబాద్ – తిరుపతి (02764) – జనవరి 10, 17 తేదీల్లో
తిరుపతి – సికింద్రాబాద్ (02763) – జనవరి 11, 18 తేదీల్లో
సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07271) – జనవరి 12 తేదీల్లో
కాకినాడ టౌన్ – సికింద్రాబాద్ (07272) – జనవరి 13 తేదీల్లో
సికింద్రాబాద్ – బ్రహ్మపుర్ (07093) – జనవరి 8, 15 తేదీల్లో
బ్రహ్మాపుర్ – సికింద్రాబాద్ (07094) – జనవరి 9, 16 తేదీల్లో
నర్సాపూర్ – సికింద్రాబాద్ (07251) – జనవరి 10 తేదీల్లో
సికింద్రాబాద్ – నర్సాపూర్ (07252) – జనవరి 11 తేదీల్లో
విశాఖపట్టణం–కర్నూలు (08541/08542) ప్రత్యేక రైలు ఈ నెల 10,11, 17, 18, 24, 25 తేదీల్లో సాయంత్రం 5.35 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.35కు కర్నూలు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు విశాఖకు చేరుకుంటుంది.
శ్రీకాకుళం–వికారాబాద్ (08547/08548) స్పె షల్ ట్రైన్ ఈ నెల 12, 13, 19, 20, 26, 27 తేదీ ల్లో సాయంత్రం 5 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో రాత్రి 8.25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.15 కు వికారాబాద్‌కు చేరుకుంటుంది.
సికింద్రాబాద్–తిరుపతి (02764/02763) స్పెషల్ ట్రైన్ ఈ నెల 10, 11, 17,18 తేదీల్లో సాయంత్రం 6.40 కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.45కు చేరుకుంటుంది.తిరుగుప్రయాణంలో సాయంత్రం 5.15కు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 5.55 గం.కు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది.
సికింద్రాబాద్–కాకినాడ (07271/07272) ప్ర త్యేక రైలు ఈనెల 12న రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చే రుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రాత్రి 8.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉద యం 8.30 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
సికింద్రాబాద్–బ్రహ్మపుర్–వికారాబాద్ (07089/07090) స్పెషల్ ట్రైన్ ఈ నెల 7, 8, 14, 15 తేదీల్లో రాత్రి 7.45కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.15కు బ్రహ్మపుర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 12.30గంటలకు బ్రాహ్మణ్‌పూర్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది.
* వికారాబాద్–బ్రహ్మపుర్–సికింద్రాబాద్ (07091/07092) స్పెషల్ ట్రైన్ ఈ నెల 9, 10, 16, 17 తేదీల్లో సాయంత్రం 6 గంటలకు వికారాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజుఉదయం 11.15 గంటలకు బ్రహ్మపుర్ చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో మధ్యాహ్నం 12.30కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. మరిన్ని వివరాలు, రైళ్లకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం https://www.irctc.co.in/nget/train-search చూడండి.
0 Response to "Good news for Sankranti pilgrims. 32 more special trains, full details"
Post a Comment