Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Explanation of how to vote. What to do if we do not get a beep sound when we vote.

 ఓటు ఎలా వేయాలో వివరణ.మనం ఓటు వేసినప్పుడు బీప్ సౌండ్ రాకుంటే ఏమి చేయాలి.

దేశంలో 2024 లోక్‌సభ నాలుగో దశ ఎన్నికలకు(lok sabha 2024 elections) సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని 96 ఎంపీ స్థానాల కోసం పోలింగ్ జరగనుంది.

దీంతోపాటు ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు కూడా ఇదే రోజు ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో అయితే అసలు ఓటు ఎలా వేయాలి, ఓటు వేసిన తర్వాత శబ్దం రాకపోతే(beep sound) ఏం చేయాలనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

  • మీరు ముందుగా మీ IDతో పోలింగ్ స్టేషన్‌లోని ఓటింగ్ బూత్‌ను చేరుకోవాలి.
  • ఆ తర్వాత లైన్‌లో నిలబడండి. దీని తర్వాత పోలింగ్ అధికారి ఓటరు జాబితాలో మీ పేరు, మీ గుర్తింపు రుజువును తనిఖీ చేస్తారు.
  • ఆ తర్వాత పోలింగ్ అధికారి మీ వేలి గోరుపై చెరగని సిరాతో గుర్తుపెట్టి, స్లిప్ ఇచ్చి మీ సంతకాన్ని తీసుకుంటారు.
  • మీరు ఆ స్లిప్‌ను మూడవ పోలింగ్ సిబ్బందికి సమర్పించి, మీ సిరా వేసిన వేలిని చూపించి, ఆ తర్వాత మీరు పోలింగ్ బూత్‌కు వెళ్లాలి
  • అప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (EVM)లో మీకు నచ్చిన అభ్యర్థి గుర్తుకు వ్యతిరేకంగా బ్యాలెట్ బటన్‌ను నొక్కడం ద్వారా మీ ఓటును నమోదు చేయవచ్చు
  • మీరు ఓటు వేయాలనుకున్న అభ్యర్థి ముందు ఉన్న నీలిరంగు బటన్‌ను నొక్కండి, అప్పుడు ఎంచుకున్న అభ్యర్థి పేరు ముందు రెడ్ లైట్ వెలుగుతుంది
  • ఆ క్రమంలో కంట్రోల్ యూనిట్ నుంచి బీప్ సౌండ్ వస్తుంది. అప్పుడు మీ ఓటు విజయవంతంగా వేయబడిందని నిర్ధారించుకోవచ్చు
  • ఒకవేళ మీరు ఓటు వేసిన తర్వాత VVPATలో మీకు ఓటింగ్ స్లిప్ కనిపించకపోయినా, బీప్ సౌండ్ రాకున్నా అక్కడే ఉన్న ప్రిసైడింగ్ అధికారిని అడగవచ్చు
  • ఓటు వేసిన క్రమంలో VVPAT మెషీన్ పారదర్శక విండోలో కనిపించే స్లిప్‌ను కూడా తనిఖీ చేసుకోవచ్చు
  • అభ్యర్థి క్రమ సంఖ్య, పేరు, గుర్తుతో కూడిన ఈ స్లిప్ 7 సెకన్ల పాటు కనిపిస్తుంది. ఆ తర్వాత అది సీలు చేసిన VVPAT బాక్స్‌లో పడిపోతుంది.
  • మీరు ఏ అభ్యర్థికి కూడా ఓటు వేయడం ఇష్టం లేకపోతే మీరు NOTA (పైన ఉన్న వాటిలో ఏదీ కాదు)పై కూడా నొక్కవచ్చు. ఇది ఈవీఎం మెషీన్‌లోని చివరి బటన్
  • మీకు మరింత సమాచారం కావాలంటే ecisveep.nic.in లో ఓటర్ గైడ్‌ని సందర్శించవచ్చు
  • ఓటింగ్ బూత్‌లోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలు లేదా మరే ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించడం నిషేధం

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Explanation of how to vote. What to do if we do not get a beep sound when we vote."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0