Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Ratan Tata

 రతన్ టాటా కన్నుమూత: ప్రధాని మోడీ సహా ప్రముఖుల దిగ్భ్రాంతి.

Ratan Tata: ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (86) (Ratan Tata) కన్నుమూశారు. ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య చికిత్స తీసుకుంటున్న ఆయన బుధవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు.

వృద్ధాప్య సమస్యల కారణంగా గత కొంత కాలంగా ఆయన వైద్య చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారు.

కాగా, 1937 డిసెంబర్ 28న నావల్ టాటా - సోనీ టాటా దంపతులకు రతన్ టాటా జన్మించారు. 1991 సంవత్సరంలో రతన్ టాటా టాటా గ్రూప్ చైర్మన్ అయ్యారు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూడలేదు. 10 వేల కోట్లుగా ఉన్న టాటా పారిశ్రామిక సామ్రాజ్యాన్ని లక్ష కోట్లకు తీసుకెళ్లడంలో ఆయన కృషి ఎంతో ఉంది. భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన పారిశ్రామికవేత్తలలో రతన్ టాటా ఒకరు. ఆయన నాయకత్వంలో టాటా గ్రూప్ అనేక ముఖ్యమైన విజయాలను సాధించింది. రతన్ టాటాకు 2000లో పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్, దేశం రెండవ అత్యున్నత పౌర పురస్కారాలు లభించాయి.

పద్మవిభూషణ్ రతన్ టాటా మరణించారన్న వార్తను టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ ధృవీకరిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. మేము నిజంగా మిస్టర్ రతన్ నావల్ టాటాకు వీడ్కోలు పలుకుతున్నాము. టాటాకు మాత్రమే కాకుండా సమాజానికి అపరిమితమైన సహకారం అందించిన అసాధారణ నాయకుడు అని ఆయన పేర్కొన్నారు.

'టాటా గ్రూప్‌కి, రతన్ టాటా చైర్‌పర్సన్‌ కంటే ఎక్కువ. నాకు, ఆయన ఒక గురువు, మార్గదర్శకుడు, స్నేహితుడు. ఆయన ఉదాహరణ ద్వారా ప్రేరణ పొందాడు. ఒక తిరుగులేని నిబద్ధతతో శ్రేష్ఠత, సమగ్రత, ఆవిష్కరణలతో, అతని సారథ్యంలో టాటా గ్రూప్ దాని విస్తరణకు దారితీసింది. ప్రపంచ పాదముద్ర ఎల్లప్పుడూ దాని నైతిక దిక్సూచికి కట్టుబడి ఉంటుంది అని చంద్రశేఖరన్ చెప్పారు.

పరోపకారం, సమాజ అభివృద్ధికి రతన్ టాటా అంకితభావం లక్షల మంది జీవితాలను తాకింది. విద్య నుంచి ఆరోగ్య సంరక్షణ వరకు, అతని కార్యక్రమాలు లోతుగా పాతుకుపోయాయి. రాబోయే తరాలకు ఉపయోగపడే గుర్తు. ఈ పనులన్నింటిని బలపరిచేది మిస్టర్ టాటా ప్రతి వ్యక్తి పరస్పర చర్యలో నిజమైన వినయం. మొత్తం టాటా కుటుంబం తరపున, నేను అతని ప్రియమైన వారికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మేము ఆయన సూత్రాలను నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆయన వారసత్వం మనకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఉద్రేకంతో విజేతగా నిలిచారు అంటూ టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు.

The clock has stopped ticking. The Titan passes away. #RatanTata was a beacon of integrity, ethical leadership and philanthropy, who has imprinted an indelible mark on the world of business and beyond. He will forever soar high in our memories. R.I.P pic.twitter.com/foYsathgmt

— Harsh Goenka (@hvgoenka) October 9, 2024

రతన్ టాటా చనిపోయారంటూ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 'గడియారం టిక్ చేయడం ఆగిపోయింది. టైటాన్ చనిపోయిది. రతన్ టాటా సమగ్రత, నైతిక నాయకత్వం, దాతృత్వానికి ఒక వెలుగు వెలిగారు, ఆయన వ్యాపార, వెలుపలి ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు. ఆయన మన జ్ఞాపకాలలో ఎప్పటికీ ఎదుగుతాడు. ఆర్.ఐ.పి' అంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.

ప్రధాని మోడీ సహా ప్రముఖుల దిగ్భ్రాంతి

రతన్ టాటా మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనను కలిసిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. రతన్ టాటా జీ దూరదృష్టి గల వ్యాపార నాయకుడు, దయగల ఆత్మ, అసాధారణమైన మానవుడు. అతను భారతదేశంలోని పురాతన, అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారు. అదే సమయంలో, అతని సహకారం బోర్డ్‌రూమ్‌కు మించినది. ఆయన వినయం, దయ, మన సమాజాన్ని మెరుగుపరచాలనే అచంచలమైన నిబద్ధతకు కృతజ్ఞతలు. చాలా మందికి ఆయన ఆప్తుడయ్యారు' అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ప్రధాని మోడీ తాను గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలోనూ రతన్ టాటాను కలిసిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు.

రాజ్‌నాథ్ సంతాపం

రతన్ టాటా మృతి పట్ల తాను తీవ్రంగా బాధపడ్డానని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఆయన మన ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, పరిశ్రమలకు తన గణనీయమైన కృషికి ప్రసిద్ధి చెందిన భారతీయ వ్యాపారానికి దృఢంగా ఉన్నారు. ఆయన కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి కలగాలి అని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు.

నమ్మలేకపోతున్నా..: ఆనంద్ మహీంద్రా

పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా.. 'రతన్ టాటా లేకపోవడాన్ని నేను అంగీకరించలేను' అని ఎక్స్‌లో పేర్కొన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ చారిత్రాత్మక పురోగతికి చేరువలో ఉంది. మనం ఉన్న చోటికి రతన్ జీవితం, పని చాలా పెద్ద సహకారం అందించింది. అందువల్ల, ఈ సమయంలో ఆయన మార్గదర్శకత్వం మరింత అమూల్యమైనది. ఆయన పోయిన తర్వాత, మనం చేయగలిగేదల్లా ఆయన చూపిన మార్గాన్ని అనుసరించడమే. ఎందుకంటే ఆయన ఒక వ్యాపారవేత్త, అతని కోసం ఆర్థిక సంపద, విజయం, ప్రపంచ సమాజానికి సేవ చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. మహోన్నతుడికి వీడ్కోలు. మిమ్మల్ని మరిచిపోలేము. ఎందుకంటే లెజెండ్స్ ఎప్పటికీ చనిపోరు...ఓం శాంతి" అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.

Ratan Tata Love Story: లక్షల కోట్ల అధిపతికి కన్నీళ్లు పెట్టించే ప్రేమ కథ.. ఆమె కోసమే రతన్ టాటా పెళ్లి చేసుకోలేదా?

దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా గురించి తెలియని వారు ఉండరు. ఆయన మరణం వ్యాపారసామ్రాజ్యంలో ఓ తీరని లోటు అనే చెప్పుకోవాలి.

ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. విలువలతో కూడిన వ్యాపారం, నిరంతరం ఉద్యోగుల కోసం ఆలోచించే ఆయనంటే ప్రజలకు ఎనలేని అభిమానం. ఆయన జీవితంలో తీరని లోటు ఏదైనా ఉంది అంటే అది ఆయన పెళ్లి మాత్రమే. అయితే ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే.

1937 డిసెంబర్ 28న జన్మించిన రతన్ టాటాకు టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్ జీ టాటా ముత్తాత అవుతారు. 1948లో రతన్ టాటాకు పదేళ్ల వయసున్నప్పుడు, ఆయన పేరెంట్స్ విడాకులు తీసుకోవడంతో రతన్ తన నానమ్మ నవాజ్ బాయి టాటా వద్ద పెరిగారు.

రతన్ టాటా 1955లో న్యూయార్క్‌లోని రివర్ డేల్ కంట్రీ స్కూల్ నుంచి డిప్లొమా పూర్తి చేశారు. 1961లో టాటా గ్రూప్‌లో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో మేనేజ్‌మెంట్ డిగ్రీ పూర్తి చేశారు. 2004లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రారంభించారు.

అంచెలంచెలుగా ఎదిగి రతన్ టాటా భారతదేశం గర్వించే వ్యాపారవేత్తగా నిలిచారు. ఆయన చేసిన దాతృత్వ కార్యక్రమాలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. 2014లో ఐఐటీ బాంబేకు ఆయన ఇచ్చిన 95 కోట్ల విరాళం దీనికి ఒక ఉదాహరణ మాత్రమే. కరోనా సమయంలో రూ.1500 కోట్ల భారీ విరాళం అందించారు.

అయితే రతన్ టాటా పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయారు. దీని వెనుక ఓ పెద్ద ప్రేమకథ ఉంది. రతన్ టాటా అమెరికాలో ఉన్నప్పుడు ఓ యువతితో ప్రేమలో పడ్డారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నప్పటికీ, ఆ సమయంలో రతన్ టాటా అమ్మమ్మ ఆరోగ్య సమస్యల కారణంగా భారతదేశానికి రావాల్సి వచ్చింది. అదే సమయంలో భారత్-చైనా యుద్ధం జరుగుతోంది, దాంతో ఆ యువతి భారత్‌కు రావడానికి అనుమతి లేకపోవడంతో వారి ప్రేమకథ పెళ్లి పీటల వరకు వెళ్ళలేదు.

రతన్ టాటా ఒక ఇంటర్వ్యూలో తనకు భార్య, పిల్లలు లేకపోవడం వల్ల కొన్నిసార్లు ఒంటరిగా అనిపిస్తుందని చెప్పారు. చాలా మంది అమ్మాయిలతో ప్రేమలో పడ్డప్పటికీ, పనిలో బిజీగా ఉండడం వల్ల పెళ్లి వరకు వెళ్లలేదని తెలిపారు. "వివాహం జరగకపోవడానికి సరైన సమయం దొరకకపోవడం కూడా ఒక కారణం. నేను కొన్ని సార్లు ప్రయత్నించినప్పటికీ, అది వర్కౌట్ కాలేదు." అని ఆయన పేర్కొన్నారు.

పదేళ్లు ఉన్నప్పుడు రతన్ టాటా తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో కొంత బాధపడ్డారు. "మా తల్లిదండ్రుల విడాకుల కారణంగా నేను, నా తమ్ముడు కొంత ఇబ్బంది పడ్డాం. ఆ రోజుల్లో విడాకులు సహజం కాదు. మా అమ్మ రెండో పెళ్లి చేసుకోవడంతో స్కూల్‌లోని పిల్లలు ర్యాగింగ్ చేసేవారు. అయినప్పటికీ మా నానమ్మ గౌరవంగా, గొడవలు లేకుండా బతకడం నేర్పింది. అది నేటికీ నాలో ఉంది." అని రతన్ టాటా తెలిపారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Ratan Tata"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0