Children should not be scolded for reading. If they do this, they will read better.
పిల్లలు చదవాలంటే తిట్టడం కాదు.ఇలా చేస్తే బాగా చదువుతారు.
పిల్లలకు ఆటలంటే చాలా ఇష్టం. కానీ ఈ ఆటల్లో పడి చదువును నెగ్లెట్ చేస్తుంటారు. అందుకే చదమని పిల్లల్ని తల్లిదండ్రులు బాగా తిండుతుంటారు. కానీ తిట్ల వల్ల పిల్లలు ఎప్పుడూ చదవరు.
మరి పిల్లలు చదవాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ప్రతి పేరెంట్స్ పిల్లల కోసం ఎంతో కష్టపడతారు. వారికి మంచి భవిష్యత్తును ఇవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే పిల్లలు చేసే కొన్ని పనులు మాత్రం తల్లిదండ్రులకు చిరాకు తెప్పిస్తాయి. వారిని తిట్టేలా, కొట్టెలా చేస్తుంటాయి. ముఖ్యంగా చదువు విషయంలో.
నేటి కాలంలో పిల్లలు ఫోన్లకు బాగా అడిక్ట్ అయిపోయారు. దాంట్లో వీడియోలు చూడటం, ఆన్ లైన్ గేమ్స్ ఆడటం వంటివి ఎక్కువగా చేస్తుంటారు. వీటితో పాటుగా బాగా ఆడుకుంటుంటారు. వీటన్నింటి వల్ల పిల్లల చదువు ఎక్కడ దెబ్బతింటుందోనని తల్లిదండ్రులు బాగా ఆందోళన చెందుతుంటారు. నిజానికి ఈ ఫోన్ల వల్ల చాలా మంది పిల్లలు చదువుపై ఎక్కువ ఫోకస్ చేయడం లేదు.
ఈ అలవాటును మాన్పించడం తల్లిదండ్రుల బాధ్యత. అందుకే పిల్లలు బాగా చదవాలని, గొప్పవారిగా ఎదగాలని తల్లిదండ్రులు పిల్లల్ని చదవాలని బాగా ఫోర్స్ చేస్తుంటారు. తిడుతుంటారు, కొడుతుంటారు. కానీ ఇలా చేసినంత మాత్రాన పిల్లలు చదువుతారనుకోవడం భ్రమే అవుతుంది. నిజానికి ఎప్పుడూ కొట్టడం, తిట్టడం వల్ల పిల్లలు మొండిగా అవుతారు. కాబట్టి పిల్లలు చదవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పిల్లలను చదివించే మార్గాలు
పిల్లలు పెద్దవారిలా కాదు. వారికి ఎలాంటి బాధలు తెలియవు. కాబట్టి వారు ఎప్పుడూ ఉల్లాసంగా ఉంటారు. ప్రసెంట్ ను బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు ఎప్పుడూ ఆటల్లో బిజీగా ఉంటారు. కానీ ఇది మంచిది కాదు. కాబట్టి మీరు మీ పిల్లలకు చదువుపై ఇంట్రెస్ట్ ను కలిగించాలంటే మీరు వారితో ప్రేమగా మాట్లాడండి.
అయినా ప్రస్తుత కాలంలో చాలా మంది తల్లిదండ్రులు చదువుకున్న వారే ఉన్నారు. కాబట్టి పిల్లలకంటే ముందు మీరు చదువుపై ఆసక్తి చూపించాలి. ఇందుకోసం మీ పిల్లలు చదువుకోవడానికి ఒక సమయాన్ని సెట్ చేయాలి. ఈ టైంలో పిల్లలే కాదు తల్లిదండ్రులు కూడా పిల్లలతో కూర్చొని చదవాలి. అప్పుడే పిల్లలు కూడా చదువుకుంటారు.
పిల్లలు చదవడానికి ఒక ట్రిక్ బాగా ఉపయోగపడుతుంది. అంటే మీరు ఫస్ట్ చదివితేనే మీరు ఆడుకోవడానికి పంపిస్తాను. లేదంటే అస్సలు పంపించనను, ఇలా ఎంతసేపైనా కూర్చో.. అని సరదాగా చెప్పండి. లేదంటే కొద్దిసేపు ఆడుకోమని, మరికొంత సేపు చదువుకోమని ప్రేమగా చెప్పే ప్రయత్నం చేయండి. మీకు సాధ్యమైనంత వరకు మీ పిల్లలకు మీరే హోమ్ స్కూలింగ్ నేర్పించడానికి ప్రయత్నించండి.
పిల్లలు బాగా చదవాలంటే మీరు వారికి తగిన సమయాన్ని కేటాయించాలి. అలాగే వారు శ్రద్ధగా చదువుకోవడానికి అనువైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మీపై ఉంది. మీకు మీఇంటి వాతావరణం నచ్చకపోతే ఇంట్లో వారికోసం ఒక స్థలాన్ని ఏర్పాటు చేయండి. దీనివల్ల పిల్లలకు చదువుపై ఇంట్రెస్ట్ కలుగుతుంది.
కేవలం చదువు మాత్రమే పిల్లలకు ఉపయోగపడదు. కాబట్టి ఎడ్యుకేషన్ పై ఇంట్రెస్ట్ చూపిస్తూనే మీ పిల్లలు పాఠ్యేతర కార్యకలాపాలపై ఎక్కువ ఆసక్తి చూపేలా చేయండి. అంటే చాలా మంది పిల్లలకు గేమ్స్ అంటే కూడా చాలా ఇష్టం ఉంటుంది. అందుకే వారి ఇష్టా ఇష్టాలను తెలుసుకుని వారిని అందులో ప్రోత్సహించండి.
అలాగే సమాజంలో జరుగుతున్న విషయాల గురించి కూడా పిల్లలకు అవగాహన కల్పించాలి. కానీ చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని పుస్తకాల పురుగుల్ని మాత్రమే చేయాలనుకుంటారు. దీనివల్ల మీ పిల్లలకు సమాజం గురించి ఏమీ తెలియకుండా పోతుంది. మీరు ఈ స్టెప్స్ ను ఫాలో అయినా చదువుపై ఇంట్రెస్ట్ చూపడం లేదంటే వారు ఒత్తిడికి గురవుతున్నారేమో తెలుసుకోండి. వారిని ఓ కంట కనిపెడుతూ ఉండండి.
0 Response to "Children should not be scolded for reading. If they do this, they will read better."
Post a Comment