AP Cabinet meeting Highlights
AP Cabinet meeting Highlights
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఎస్సి, ఎస్టీ, బిసి, మహిళా పారిశ్రామిక వేత్తలను ఆదుకునేలా ప్రభుత్వ పాలసీలను రూపొందిస్తూ,.. నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు MSME పాలసీలో మార్పులకు నేటి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. విద్యుత్ సహా పలు విభాగాల్లో ఎస్సి, ఎస్టీ, బిసి, మహిళా వర్గ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వనుంది కూటమి ప్రభుత్వం.
ఏపీ మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. సంక్షేమ పథకాలు.. ఎన్నికల హామీల అమలు పైనా సుదీర్ఘంగా చర్చించారు. పథకాల అమలు కోసం క్యాలెండర్ ఖరారు పైన ఒక అంచనాకు వచ్చారు.
అన్నదాత సుఖీభవ పథకం పైన మంత్రులకు చంద్రబాబు కీలక సూచ నలు చేసారు. ఇక, మధ్యాహ్న భోజనం లో మార్పులకు నిర్ణయించారు. మద్యం వ్యాపారుల మార్జిన్ పెంపుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
పథకాల పై చర్చ
ఏపీ మంత్రివర్గ సమావేశంలో సంక్షేమ పథకాల అమలు పైన కీలక చర్చ జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం అమలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితి పైన మంత్రివర్గంలో వివరించారు. జూన్ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటం తో ఇచ్చిన హామీ మేరకు ప్రతీ విద్యార్ధికి అమలయ్యేలా తల్లుల ఖాతాల్లో రూ 15 వేల జమ దిశగా పథకం అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. అన్నదాత సుఖీభవ గా అమలు చేయనున్న రైతు భరోసా పై మంత్రులకు చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. రైతుల పథకం అమలు కోసం విధి విధానాల ఖరారు పైన మంత్రులు ఫోకస్ చేయాలని నిర్దేశించారు. ఏప్రిల్ నుంచి మత్స్యకార పథకం అమలు చేయాలని నిర్ణయించారు.
కీలక నిర్ణయాలు
ఇప్పటికే కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ తో పాటుగా అన్నదాత సుఖీభవ అమలు చేసేలా ప్రభుత్వం నిర్ణయించింది. మూడు విడతల్లో ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలనేది తాజా ప్రతిపాదన. ఇక, మధ్నాహ్న భోజన పథకంలో సన్న బియ్యం వినియోగిస్తున్నట్లు మంత్రి లోకేష్ కేబినెట్ భేటీలో వెల్లడించారు. ప్రాంతాల వారీగా అక్కడి రుచులకు అనుగుణంగా విద్యార్ధులకు మధ్నాహ్న భోజన పథకంలో మెనూ అమలు చేస్తున్నట్లు వివరించారు. మొత్తం 21 అంశాల పై చర్చించి.. నిర్ణయాలు తీసుకున్న మంత్రివర్గ భేటీలో.. మద్యం వ్యాపారులకు మార్జిన్ ను 10.5 నుంచి 14 శాతంకు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భారత్ లో తయారైన విదేశీ మద్యం , బీర్, ఎఫ్ ఎల్ స్పిరిట్ ల పై అదనపు రిటైల్ ఎక్సైజ్ టాక్స్ సవరణను ఆమోదించారు.
ప్రజల్లోకి మంత్రులు
నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ఇకపై 34 శాతం రిజర్వేషన్‌కు మంత్రిమండలి ఆమోదం తెలిపిం ది. ఈ నిర్ణయంతో బీసీలకు కీలక పదవులు దక్కే అవకాశం ఉంది. ఇదే సమయంలో నామినేటెడ్ పోస్టుల్లో బీసీ ఎస్సి ఎస్టీ, మైనారిటీ లకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2019 లో చేసిన చట్ టాన్ని వెనక్కు తీసుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. స్టాంపు లు రిజిస్ట్రేషన్ల శాఖ లో డాక్యుమెం ట్ ల రిజిస్ట్రేషన్ కు డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రవేశ పెట్టే ప్రతిపాదన పై కేబినెట్ చర్చించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభించేలా ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు మరింత బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేసారు. మూడు నెలల పాటు ప్రజల్లోనే ఉండాలని నిర్దేశించారు
0 Response to "AP Cabinet meeting Highlights "
Post a Comment