Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Don't pay a fine for forgetting your driving license ...

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోతే జరిమానా కట్టాల్సిన పని లేదు... ఇలా చేస్తే చాలు
Don't pay a fine for forgetting your driving license ...

డాక్యుమెంట్లను రెండు యాప్స్‌లో సేవ్ చేసుకుని ఉండుంటే ఈ జరిమానాల నుంచి బయటపడవచ్చు.
88. ఈ రెండు యాప్స్ కూడా డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినవే.

ఎంపరివాహన్‌ యాప్‌తో ప్రయోజనాలేంటి?

  • ఎంపరివాహన్‌ యాప్‌తో ఎన్నో లాభాలున్నాయని ప్రప్రభుతతీసుకొచ్చింది
  • డ్రైవింగ్ లైసెన్సులు పర్సులో పెట్టుకుని తిరగాల్సిన అవసరం ఉండదు. 
  • ఎప్పుడైనా ఎక్కడైనా ఆన్‌లైన్‌లో వీటిని వాడుకోవచ్చు. షేర్ చేసుకోవచ్చు.
  • కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన ఈ యాప్‌లో ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్‌లను డిజిటల్ రూపంలో భద్రపరుచుకోవచ్చు. 
  • ఇవి ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలతో సమానం. 
  • ఈ యాప్‌ ద్వారా డౌన్‌లోడ్ చేసుకున్న సాఫ్ట్‌ కాపీలను కూడా హార్డ్‌ కాపీలుగానే భావిస్తారు. 
  • ఎందుకంటే కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ డేటాబేస్‌ నుంచి నేరుగా డౌన్‌లోడ్ అయ్యే ఈ కాపీలపై డిజిటల్ సిగ్నేచర్ ఉంటుంది.
  • పోలీసులు అడిగినప్పుడు ఎంపరివాహన్ యాప్‌లో వాటిని చూపిస్తే జరిమానా నుంచి తప్పించుకోవచ్చు. 
  • అయితే, ఫోన్‌లో ఫొటో తీసి లేదా స్కాన్ చేసి పెట్టుకుంటే ఆ డాక్యుమెంట్లు చెల్లుబాటు కావు.న
  • ఈ యాప్‌ ద్వారా వాహనం ఏదైనా దాని బేసిక్ వివరాలు తెలుసుకోవచ్చు. 
  • అంటే వాహనం ఎవరి పేరు మీద ఉంది.. ఏ ప్రాంతానికి చెందినది.. 
  • ఎప్పుడు రిజిస్ట్రర్ అయింది.. ఏ మోడల్‌ వంటి వివరాలు తెలుసుకోవచ్చు. 
  • యాప్ ఓపెన్ చేసి పైనున్న సెర్చ్ బార్‌లో వాహనం నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే ఈ వివరాలన్నీ వచ్చేస్తాయి. 
  • ఈ వివరాలు తెలుసుకునేందుకు ఈ యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు.
  • ఇందులో క్యూర్ కోడ్ కూడా ఉంటుంది. దాన్ని వాహనంపై స్టిక్కర్‌గా అతికించుకోవచ్చు.
  • ట్రాఫిక్ అప్‌డేట్స్‌తో పాటు సమీపంలో ఉన్న ఆర్టీవో ఆఫీసుల వివరాలు కూడా పొందొచ్చు.
  • రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఈ యాప్‌ ద్వారా ఫోటో తీసి అప్‌లోడ్ చేస్తే పోలీసులు-అంబులెన్స్‌ సిబ్బంది సమన్వయం చేసుకుని సాధ్యమైనంత త్వరగా ఘటన స్థలానికి చేరుకుంటారు.
  • ఈ యాప్‌తో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి ఫోటోలు తీసి పంపితే పోలీసులు వారికి కొరియర్‌లో చలానాలు పంపిస్తారు.

ఎలా రిజిస్ట్రర్ చేసుకోవాలి

  • ఎంపరివాహన్‌ యాప్‌లో రిజిస్ట్రర్ చేసుకోవాలంటే ఫోన్‌ నెంబర్ ఉంటే సరిపోతుంది.
  •  ముందుగా గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  •  కొత్తవాళ్లు సైన్ అప్ ఆప్షన్ ఎంచుకుని ఫోన్‌ నెంబర్‌ ఎంటర్ చేయాలి. 
  • తర్వాత మొబైల్‌కి వచ్చిన ఓటీపీని టైప్ చేసి, పేరు ఇతర వివరాలు నమోదు చేసుకోవాలి. 
  • తర్వాత పై భాగంలో ఉన్న ఆర్సీ, డీఎల్‌ ఆప్షన్లలో ఏది కావాలో అది ఎంచుకుని అడిగిన వివరాలు పొందుపరిస్తే సరిపోతుంది.

డిజి లాకర్

  • సాధారణంగా మనం విలువైన వస్తువులను లాకర్‌లో దాచుకుంటాము. 
  • అలాగే విలువైన డాక్యుమెంట్లను దాచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లాకర్‌ తీసుకొచ్చింది. 
  • అదే డిజిలాకర్ యాప్. 
  • ఇందులో డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, పాన్ కార్డ్, ఆధార్ కార్డులను డిజిటల్ రూపంలో భద్రపరుచుకోవచ్చు.
  •  వీటితో పాటు మరెన్నో సర్టిఫికెట్లను వర్చువల్‌గా సేవ్ చేసుకోవచ్చు.
  • వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు.
  •  షేర్ చేయవచ్చు. 
  • ట్రాఫిక్ పోలీసులు ఆపినప్పుడు వీటిని చూపించొచ్చు.
  • డిజి లాకర్‌లో ఉన్న ఆధార్ కూడా ఒరిజినల్ ఇ-ఆధార్‌ కిందే లెక్క. అంటే ఎలక్ట్రానిక్ ఆధార్ చెల్లుబాటైన ప్రతిచోట డిజి లాకర్‌లోని ఆధార్‌ కూడా పనిచేస్తుంది. 
  • డిజీ లాకర్‌లో ఉన్న ఆధార్‌ని ఇతర డాక్యుమెంట్లలాగే షేర్ చేసుకోవచ్చు.

ఎలా నమోదు చేసుకోవాలి

  • గూగుల్ ప్లే స్టోర్ నుంచి డిజి లాకర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. 
  • ఓటీపీతో మొబైల్ నెంబర్‌ని వెరిఫై చేసుకోవాలి. తర్వాత యూజర్ నేమ్, పాస్‌వర్డు నమోదు చేస్తే డిజి లాకర్ అకౌంట్ క్రియేట్ అయినట్లే. 
  • ఆ తర్వాత ఆధార్ నెంబర్‌ని ఈ యాప్‌కి అనుసంధానం చేసుకోవాలి. 
  • ఆ తర్వాత డాష్‌బోర్డులో ఉన్న క్విక్ లింక్స్ ద్వారా అడిగిన వివరాలు ఇచ్చి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, పాన్ కార్డులను డిజిటల్ రూపంలో పొందొచ్చు.
  • అయితే, ఆధార్‌లో ఉన్న పేరు, పుట్టిన తేదీ.. డ్రైవింగ్ లైసెన్స్‌లో ఉన్న పేరు, పుట్టిన తేదీతో మ్యాచ్ కావాలి. 
  • అప్పుడే డిజిటల్ కార్డులు వస్తాయి.
  • ఒకసారి యూజర్ ఐడీ క్రియేట్ చేసిన తర్వాత వాటిని మార్చుకునే వీలు లేదు. 
  • అలాగే, యూజర్‌ ఐడీతో ఆధార్ అనుసంధానమైన తర్వాత దాన్ని మార్చుకునే అవకాశం కూడా లేదు.
  • యూజర్ నేమ్, పాస్‌వర్డ్ మర్చిపోతే ఆధార్ నెంబర్‌ సాయంతో తిరిగి పొందొచ్చు.
  • అకౌంట్‌ని డిలీట్ చేసే అవకాశం కూడా ప్రస్తుతానికి లేదు. కానీ డిజి లాకర్‌లో ఉన్న డాక్యుమెంట్లను మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు డిలీట్ చేసుకోవచ్చు. 
  • అందులో ఉన్న డాక్యుమెంట్ల భద్రతకు ఎలాంటి ఢోకా లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

ఎంత వరకు సేఫ్?

  • డిజి లాకర్ పూర్తిగా సురక్షితమని ప్రభుత్వం చెబుతోంది. అప్‌లోడ్ చేసిన డేటా ఇతరుల చేతికి చిక్కకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించింది. 
  • డిజి లాకర్ 256 బిట్ సెక్యూర్ సాకెట్ లేయర్ - SSL ఎన్‌క్రిప్షన్ ఉపయోగిస్తోంది.
  • డిజి లాకర్‌ అకౌంట్‌లోకి లాగినయ్యే ప్రతిసారీ ఫోన్‌కి ఓటీపీ వస్తుంది. 
  • దాన్ని ఎంటర్ చేస్తేనే లాగిన్ అవుతుంది.
  • ఆధార్ అథెంటికేషన్ తర్వాత మాత్రమే యూజర్లకు డాక్యుమెంట్లను జారీ చేస్తారు.
  •  అంటే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ డిజిటల్ కాపీలు కావాలంటే ముందుగా ఆధార్‌ అథెంటికేషన్ చేసుకోవాలి.
  • వీటితో పాటు మరెన్నో భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
  • సెప్టెంబర్ 25 నాటికి 29.71 మిలియన్ల మంది డిజి లాకర్‌లో రిజిస్టర్ చేసుకున్నారు. 3.53 బిలియన్ల డాక్యుమెంట్లు జారీ చేశారు.

          Download Digi Locker app 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Don't pay a fine for forgetting your driving license ..."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0