Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Do you know how many hours a person sees on the phone ...?

Also Read:

Sakanya Samvruddi Rules

Ammavadi Check List

Jobs


ఒక మనిషి రోజుకి ఎన్ని గంటలు ఫోన్ చూస్తాడో తెలుసా...?
Do you know how many hours a person sees on the phone ...?


స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో సైబర్ మీడియా రీసెర్చ్ (సిఎమ్ఆర్) సహకారంతో చేపట్టిన 'హ్యూమన్ రేలేషన్ షిప్ పై స్మార్ట్‌ఫోన్‌ ప్రభావం'అనే అధ్యయన ఫలితాలను విడుదల చేసింది.
'స్మార్ట్‌ఫోన్ మరియు హ్యూమన్ రేలేషన్ షిప్ పై వాటి ప్రభావం' పేరుతో ఒక అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో భాగంగా దేశంలోని ముఖ్య 8 నగరాల్లో ఉండే 2 వేల మందిపై సర్వే నిర్వహించారు.
ఈ అధ్యయనం ద్వారా హ్యూమన్ రేలేషన్ షిప్ పై స్మార్ట్‌ఫోన్‌ల ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది, సగటున ఒక భారతీయుడు ఒక రోజులో మేల్కొని ఉండే సమయంలో 1/3 వ భాగాన్ని తమ ఫోన్‌ చూస్తూ గడుపుతున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది.ఈ లెక్క ప్రకారం ఇది ఒక సంవత్సరానికి 1,800 గంటల సమయాన్ని స్మార్ట్‌ఫోన్ చూస్తూ గడిపేస్తున్నారు అని తెలిపింది.
ప్రస్తుత అధ్యయనాన్నీ 10 సంవత్సరాల క్రితంతో పోలిస్తే, 30 శాతం మంది వారి కుటుంబం ఇంకా వారి ఇష్టమైన వారిని నెలకు చాలా సార్లు కలిసేవారట. ఈ అధ్యయన ఫలితాలలో 2 శాతం మార్పులు ఉండొచ్చు కానీ 95 శాతం తమ అధ్యయనం చాలా ఖచ్చితమైన రిసల్ట్ ఉందని సిఎంఆర్ పేర్కొంది.
అయితే 75 శాతం మంది తమ టీనేజ్‌లో స్మార్ట్‌ఫోను పై తమ విలైనంత సమయాన్ని కేటాయిస్తున్నట్టు అంగీకరించారు అలాగే వారిలో 41 శాతం మంది హైస్కూల్, గ్రాడ్యూయేట్ చేసేవాళ్ళు కూడా ఫోన్‌ లో ఎక్కువ సేపు టైమ్ స్పెండ్ చేస్తున్నట్టు చెప్పారు. ప్రతి ముగ్గురిలో ఒకరు తమ ఫోన్‌లను చూడకుండా స్నేహితులు, కుటుంబ సభ్యులతో 5 నిమిషాల సంభాషణ కూడా చేయలేమని భావిస్తున్నారు.

గుడ్ న్యూస్

అయితే గుడ్ న్యూస్ ఏంటంటే, స్మార్ట్‌ఫోన్‌ వాడకం ప్రస్తుత రేటులో ఇలనే కొనసాగితే లేదా పెరిగితే అది మానసిక లేదా శారీరక ఆరోగ్యంపై ప్రభావితం చూపిస్తుందని 73 శాతం మంది అంగీకరించారు. ప్రతి అయిదుగురిలో ముగ్గురు ఫోన్ లేకుండా జీవితాన్ని గడపడం చాలా ముఖ్యం అని అది మరింత సంతోషకరమైన జీవితాలకు దారితీస్తుందని చెప్పారు.
ఈ అధ్యయనం 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు గల గృహిణులు,యువత, ఉద్యోగం చేసే వారి పై చేశారు. మొత్తంగా 2000 మందిపై ఈ అధ్యయనం చేశారు, వారిలో 36 శాతం మంది మహిళలు, 64 శాతం మంది పురుషులు ఉన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Do you know how many hours a person sees on the phone ...?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0