Inspiration
22 ఏళ్లకే ఐపీఎస్... ఆల్ ఇండియా రికార్డ్...!
దేశంలోనే అతి చిన్న వయస్సులో గుజరాత్ రాష్ట్రానికి చెందిన హసన్ సఫిన్ ఐపీఎస్ అధికారిగా ఎంపికై రికార్డ్ సృష్టించాడు.
ఈ నెల 23వ తేదీన హసన్ సఫిన్ జామ్ నగర్ అసిస్టెంట్ పోలీస్ సూపరిండెంట్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. హసన్ సఫిన్ గుజరాత్ రాష్ట్రంలోని పాలన్పూర్ లోని కనోదర్ గ్రామానికి చెందినవాడు. గత సంవత్సరం నిర్వహించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో హసన్ సఫీన్ ఐపీఎస్ కావడానికి గల అర్హతలను సాధించారు. అతి చిన్న వయసులో ఐపీఎస్ ఆఫీసర్ కావడానికి అర్హత సంపాదించటంపై స్పందిస్తూ తనకు వచ్చిన ఈ అవకాశాన్ని దేశానికి సేవ చేయటం కొరకు ఉపయోగిస్తానని చెప్పాడు. హసన్ నిరుపేద కుటుంబంలో జన్మించాడు.
హసన్ ను చదివించటానికి అతని తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారు. హసన్ తల్లిదండ్రులు నసీంబా, ముస్తఫా హసన్ కార్మికులుగా చిన్న వజ్రాల యూనిట్ లో పని చేశారు. హసన్ తల్లిదండ్రులు సంపాదించే ఆదాయం అతని కుటుంబ ఖర్చులకు కూడా సరిపోయేవి కావు. తమ కుమారుడిని ఉన్నత చదువులు చదివించాలనే ఆశతో హసన్ తల్లిదండ్రులు రెస్టారెంట్లలో కూడా పని చేశారు.
అలా కష్టపడి పని చేసి హసన్ ఉన్నత విద్యకు అతని తల్లిదండ్రులు డబ్బులను సమకూర్చారు. కొందరు వ్యాపారవేత్తలు కూడా ఉన్నత చదువులు చదవటానికి డబ్బు సహాయం చేశారని హసన్ తెలిపారు. గత ఏడాది నిర్వహించిన పరీక్షల్లో జాతీయ స్థాయిలో హసన్ 570వ ర్యాంకు సాధించారు. ఐఏఎస్ కావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న హసన్ ఐఏఎస్ కు ఎంపిక కాకపోవడంతో ఐపీఎస్ ను ఎంచుకున్నట్లు చెప్పారు.
హసన్ తన తల్లిదండ్రులు తనకోసం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం సాధించి చూపించారు. కుటుంబ పరిస్థితుల గురించి ఆలోచించి హసన్ సఫీన్ ఐఏఎస్ సాధించలేకపోయినా ఐపీఎస్ ఆఫీసర్ గా దేశానికి సేవ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తమ కుమారుడు అతి చిన్న వయస్సులో ఐపీఎస్ గా ఎంపిక కావడంపై హసన్ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Very informative. You may be interested in the following educational resources for online learning:
ReplyDelete1. Learning and Management System
2. Computer Based Test
3. A+ Labsim
4. Network+ Labsim and
5. CCNA Netsim