Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Entrance test for IIIT Students

ట్రిపుల్‌ ఐటీలకు ప్రవేశ పరీక్ష

పది పరీక్షల రద్దు నేపథ్యంలో నిర్ణయం.

రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జి టెక్నాలజీ్‌స(ఆర్‌జీయూకేటీ) ఆధ్వర్యంలో రాష్ట్రంలో నడుస్తోన్న నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో అడ్మిషన్ల కోసం ఎంట్రెన్స్‌ టెస్ట్‌ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గణితం, సైన్స్‌ సబ్జెక్టుల్లో 3 గంటలపాటు పరీక్ష నిర్వహించాలని సంకల్పించింది. ఆబ్జెక్టివ్‌ టైపులో ప్రశ్నలు ఇస్తారు. నవంబరులో పరీక్ష జరిగే అవకాశం ఉంది. పరీక్ష ఆఫ్‌లైన్‌లో జరుగుతుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను వారం రోజుల్లో విడుదల చేయనున్నారు.

ఆర్‌జీయూకేటీ చట్టం ప్రకారం పదో తరగతి మార్కులు/గ్రేడ్ల మెరిట్‌ ఆధారంగా ట్రిపుల్‌ ఐటీల్లో అడ్మిషన్లు చేపట్టాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ రంగ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన సాంకేతిక విద్యను అందించేందుకు వీలుగా 2008 నుంచి ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారు. అయితే, కొవిడ్‌-19 నేపథ్యంలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రద్దు చేయడం, విద్యార్థులకు మార్కులు, గ్రేడ్లు ఇవ్వకపోవడంతో ట్రిపుల్‌ ఐటీల్లో అడ్మిషన్లకు ఎంట్రెన్స్‌ టెస్ట్‌ నిర్వహించడమే మేలన్న అభిప్రాయానికి ఆర్‌జీయూకేటీ వచ్చింది. ఇందుకోసం వర్సిటీ చట్టానికి సవరణలు చేయాలని భావిస్తున్నారు. ఈ ఒక్కసారికి మాత్రమే ఎంట్రెన్స్‌ నిర్వహించనున్నారు.
తాజాగా గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించి ఆమోదముద్ర వేశారు. బుధవారం స్ట్రీమ్‌లైనింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించి ఎంట్రెన్స్‌పై నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి మంత్రి ఆదిమూలపు సురేశ్‌ కూడా హాజరయ్యారు. రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలుల్లో ట్రిపుల్‌ ఐటీలు ఉన్నాయి. ఒక్కో క్యాంప్‌సలో 1,000 సీట్లు ఉన్నాయి. నాన్‌లోకల్‌ విద్యార్థులకు 15 శాతం సీట్లు అందుబాటులో ఉంటాయి.®️

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

3 Responses to "Entrance test for IIIT Students"

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0